Wishes
  • చిరంజీవి మృత్యుంజయరావు, శిరీష దంపతులకు, మీ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిగినవి. HAPPY MARRIAGE DAY మృత్యుంజయరావు AND శిరీష
  • చిరంజీవి REVATI SIRISHA,DADI RAVI KUMAR దంపతులకు, మీ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిగినవి. HAPPY MARRIAGE DAY REVATI SIRISHA AND DADI RAVI KUMAR
  • TODAY'S NITHAYPOOJA MEMBERS :
CONTACT US

Friday, Jan-28th-2022


Sunday, Jan-23rd-2022 to Saturday, Jan-29th-2022


Aries


అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆచితూచి అడుగు వేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు రూపొందించుకుంటారు. డబ్బుకు ఇబ్బంది వుండదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సోమ, మంగళ వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పట్టుదలతో శ్రమించినా గానీ పనులు పూర్తికావు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు కలిసివస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. రవాణా, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి.


మేషం


అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. మనస్సు కుదుటపడుతుంది. పనుల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త విషయాలు బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అవివాహితులకు శుభయోగం. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి, విద్యార్థులకు ఒత్తిడి , ఆందోళన అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. కంప్యూటర్ , సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.


మేషం


అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు తీవ్రంగా శ్రమిస్తారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ప్రణాళికలు వేసుకుంటారు. పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆది, గురువారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. కుటుంబ విషయాలు గోప్యంగా వుంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. ఆత్మీయుల రాక ఉల్లాసాన్నిస్తుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. పత్రాల రెన్యువల్ అలక్ష్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విద్యాసంస్థలకు ఆశాజనకం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.


Tarus


కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు సంప్రదింపులతో తీరిక వుండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధా కాదు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పత్రాలు, నగదు జాగ్రత్త. గృహమరమ్మతులు చేపడతారు. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ఉపాధ్యాయులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.


వృషభం


కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. నగదు, పత్రాలు జాగ్రత్త. గృహమార్పు కలిసివస్తుంది. మీ జోక్యం అనివార్యం. మీ సలహా సన్నిహితులకు ఉపకరిస్తుంది. సంతానం పై చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలు సామాన్యం. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. బెట్టింగులకు పాల్పడవద్దు.


వృషభం


కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వాగ్ధాటితో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఖర్చులు అదుపులో వుండవు. ధనసమస్యలెదురవుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. సోమ, మంగళవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. కంప్యూటర్ రంగాల వారి ఆదాయం బాగుంటుంది. పిల్లలకు వాహనం ఇవ్వవద్దు.


Gemini


మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ వారం ఆశాజనకం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం.


మిధునం


 మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు వ్యవహారానుకూలత వుంది. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆదాయం సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దమొత్తం ధనసాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ కించపరచవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆహ్వానం అందుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారలు అంతంత మాత్రంగా సాగుతాయి. భాగస్వామిక వ్యాపారాలకు తరుణం కాదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.


మిధునం


మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ప్రతి విషయంలో ధైర్యంగా వుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. బుధవారం నాడు పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరం. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.


Cancer


పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. మంగళ, గురువారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. అధికారులకు బాధ్యతల మార్పు. ఉపాధి పథకాలు చేపడతారు.


కర్కాటకం


 పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. లౌక్యంగా వ్యవహరించడం మంచిది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. బంధుమిత్రులతో స్పర్ధలు తలెత్తుతాయి. మీ మాటతీరు అదుపులో వుంచుకోండి. బుధ, గురువారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహానిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.


కర్కాటకం


పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష పరిస్థితులు మెరుగుపడతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు లోటుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. పత్రాలు అందుకుంటారు. గురు శుక్రవారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా వుంచండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తులకు శుభయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.


Leo


 మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సైతం చేరువవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం.


సింహం


మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. అవసరాలకు ధనం అందుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. మంగళ, శనివారాల్లో పనులు సాగవు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. గృహమార్పు నిదానంగా ఫలిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు కష్టకాలం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికం. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. అధికారులకు హోదామార్పు, ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.


సింహం


మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కష్టించినా ఫలితం వుండదు. నిస్తేజానికి లోనవుతారు. అవకాశాలు చేజారిపోతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. రుణ సమస్యలు వేధిస్తాయి. శనివారం నాడు ఏ పనీ సాగదు. ప్రశాంతంగా వుండేందుకు ప్రయత్నించండి. ఆత్ముయుల కలయికతో కుదుటపడతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం జాగ్రత్త. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయజాలవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కష్టకాలం. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.


Virgo


 ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఆర్థిక స్థితి నిరాశాజనకం. దుబారా ఖర్చులు విపరీతం. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. స్థిమితంగా వుండేందుకు ప్రయత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం మంచిది. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. దురుసుతనం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. అధికారులకు బాధ్యతల మార్పు, ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి.


కన్య


ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ప్రతికూలతలు అధికం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అప్రమత్తంగా వుండాలి. శకునాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో వ్యవహరించండి. అవకాసాలు చేజారిపోయినా ఒకందుకు మంచిదే. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సోమ, మంగళవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. ఖర్చులు అధికం. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికం. ప్రయాణం విరమించుకుంటారు.


కన్య


 ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు శుభకార్యాన్ని నిరాడంబరంగా చేస్తారు. ఆప్తులు రాకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక కోసం పడిగాపులు తప్పవు. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. పదవులు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలసివస్తాయి. వాహనచోదకులకు దూకుడు తగదు.


Libra


చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. పెద్దల సలహా పాటించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. మీ ఉన్నతిని చాటుకోవడానికి విరివిగా వ్యయం చేస్తారు. సంతానం మొండి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. మంగళ, బుధవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. అనవసర జోక్యం తగదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కష్టకాలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్వాగతం పలుకుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.


తుల


చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. బంధువులతో ఉల్లాసంగా గడుపుతాపు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త పనులు చేపడతారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బుధావారం నాడు వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం. కార్మికులకు ఆశాజనకం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.


తుల


చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. మంగళ, బుధవారాల్లో పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. గృహమార్పు కలిసివస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. మీ సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వివాహ యత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ముఖ్యం. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. కీలక సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు.


Scorpio


విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో వుండవు. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. గురు, శుక్ర వారాల్లో తొందరపడి హామీలివ్వవద్దు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. ప్రైవేట్, విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. భవన నిర్మాణ కార్మికులకు పనులు లభిస్తాయి.


వృశ్చికం


విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 3 పాదములు సమర్థతను చాటుకుంటాు. నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఉభయులకు ఆమోదయోగ్యం అవుతుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. గురు, శుక్రవారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కష్టకాలం.


వృశ్చికం


విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట ధైర్యంగా వ్యవహరిస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. గురువారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా శ్రమించవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.


Sagittarius


మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం అనుకూలతలు నెలకొంటాయి. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. జాతక పొంతన ప్రధానం. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. పత్రాల రెన్యువల్‍‌లో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు శుభయోగం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. స్టాక్ మార్కెట్ లాభాల దిశగా సాగుతుంది. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం.


ధనస్సు


మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం ఆదాయం సంతృప్తికరం. కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రోజువారీ ఖర్చులే వుంటాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన అనివార్యం. తొందరపడి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. ఆది, శనివారాల్లో దంపతుల మధ్య అకారణ కలహం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం వైఖరి విసుగు కలిగిస్తుంది. అనునయంగా కలిసివస్తుంది. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.


ధనస్సు


 మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ప్రతికూలతలు అధికం. మనస్సు చికాకుగా ఉంటుంది. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా వుండటానికి ప్రయత్నించండి. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం సమయానికి అందదు. సాయం అర్థించేందుకు మనస్కరించదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అకారంణంగా మాటపడవలసి వుంటుంది. శుక్ర శనివారాల్లో అప్రమత్తంగా వుండాలి. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. ఈ చికాకులు తాత్కాలికమే. ఆప్తుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ఏమంత ఫలతమీయవు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన చోదకులకు తగదు. కీలక పత్రాలు అందుకుంటారు.


Capricorn


ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు కార్యం సిద్ధిస్తుంది. ప్రతి విషయంలోనూ మీదే పై చేయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. అభియోగాలు తొలగిపోగలవు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆది, మంగళ వారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. దూకుడుగా వ్యవహరించవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగా వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


మకరం


ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఈ వారం ఆశాజనకం. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఇతరులను మీ విషయలకు దూరంగా వుంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. పదవులు అందుకుంటారు. ఉపాధి అవకాసాలు కలిసివస్తాయి.


మకరం


ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు వ్యవహారాలతో తీరిక వుండదు. రుణ ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. చీటికిమాటికి అసహనం వ్యక్తం చేస్తారు. సోదరుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ప్రతిభకు ఏమంత గుర్తింపు వుండదు. ఖర్చులు విపరీతం. పొదుపుధనం ముందుగానే గ్రహిస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. అతిగా ఆలోచించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. ప్రయాణం విరమించుకుంటారు.


Aquarius


 ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. మనశ్సాంతి వుండదు. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. పట్టుదలతో శ్రమించినా గాని పనులు పూర్తి కావు. బుధ, గురువారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం మొండితనం చికాకు పరుస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో శుభవార్తలు వింటారు. గృహమార్పు కలిసివస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఉపాధ్యాయులకు ఓర్పు ప్రధానం. ముఖ్యులతో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.


కుంభం


 ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు వ్యవహారాలతో తీరిక వుండదు. రుణ ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. చీటికిమాటికి అసహనం వ్యక్తం చేస్తారు. సోదరుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ప్రతిభకు ఏమంత గుర్తింపు వుండదు. ఖర్చులు విపరీతం. పొదుపుధనం ముందుగానే గ్రహిస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. అతిగా ఆలోచించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. ప్రయాణం విరమించుకుంటారు.

 


కుంభం


ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు సంప్రదింపులతో హడావుడిగా వుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెద్దల సలహా పాటిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం తప్పిపోతుంది. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. ఓర్పుతో మెలగండి. గృహ ప్రశాంతతను భంగపరుచుకోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి ఉపాది పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. కార్మికులకు పనులు లభిస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.


Pisces


 పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి లక్ష్యం సిద్ధిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగువేస్తారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే వుంటాయి. పెద్దమొత్తం ధనసాయం తగదు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంప్రదింపులకు అనుకూలం. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహ మరమ్మతులు చేపడతారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం పై చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.


మీనం


పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి అనుకూలతలున్నాయి. శుభకార్యం తలపెడతారు. బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. పసులు సకాలంలో పూర్తి చేస్తారు. సోమ, మంగళ వారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమతంగా వుండాలి. ప్రలోభాలకు పోవద్దు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కంప్యూటర్ రంగాల వారికి ధనయోగం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు.


మీనం


 పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ వారం అనుకూలదాయకమే. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు అదుపులో వుండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. గృహం సందడిగా వుంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకు ఆమోదయోగ్యమవుతుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అపరిచితులు మోసగించే ఆస్కారం వుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలతో తీరిక వుండదు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు శుభయోగం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.


Jan-2022


Aries


ఈనెలయందు కూడా బాగుంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య లాభం, ధైర్యంగా ముందుకుపోగలరు. అన్ని రంగాలవార్కియోగమే. శతృవులపై ఆధిక్యత. ప్రయత్నధనలాభం. కుటుంబంలో సమస్యలు తీరును. రావలసినబాకీలు వసూలగును. వ్యవహారాలు చక్కబెట్టుదురు.మీపై ఇతరులకు ఈర్ష్య ,ద్వేషం ఉంటాయి


మేషం


జన్మరాశి లో కుజుడు ఉన్నప్పటికి మిగిలిన గ్రహాల అనుకూలంగా ఉన్నందు వల్ల వ్యాపారాలు బాగా సాగును.నూతన వాహనం, వస్త్ర ప్రాప్తి, మిత్రులను కలుసుకుంటారు. ఆదాయంకు లోటుండదు. కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణాలు,సెక్కూలెషన్ లాభించును. మాసాంతంలో స్వల్పంగా ఆరోగ్యభంగాలు, శారీరక గాయాలు.


MESHAM


ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం లాభించును.వ్యవహారజయం.చేయు వృతివ్యాపారాలు రాణించును. ఉద్యోగులు అధికారులమన్ననలు,ప్రమోషన్స్ పొందుదురు. ఆరోగ్యంబాగుంటుంది. సరైన సమయంలో ధనం చేతికందును. ఎంతటి కార్యమైనా పూర్తి రాజకీయనాయకులను, ప్రముఖులను కలుసుకుంటారు.


మేషం


ఈ నెలలో మిశ్రమ ఫలితములుంటాయి.శారీరకంగా శ్రమ అధికం.ఆర్ధికంగా లోటుండదు. చిన్నచిన్న రుగ్మతులుంటాయి. బంధుమిత్రులతో సౌఖ్యం. సంతాన సౌఖ్యం, సంఘంలో గౌరవమర్యాదలకు లోటుండదు. ప్రభుత్వ సంబంధ కార్యాలు పూర్తి అగును. గృహనిర్మాణాది పనులు పూర్తి అగును. దైవదర్శనములు.


మేషం


ఈ నెలలో కూడా గ్రహముల అనుకూల సంచారం లాభించును.మిమ్ములను చూడగానే ఇతరులకు మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. గౌరవంపెరుగును. ప్రయాణాలు లాభించును. ఎంతటివారినైనా ఇట్టే వశం చేసుకుంటారు.ఆర్ధిక పరిస్థితులు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. శతృవులపై జయం.


Tarus


ఈ మాసంలో అనుకూల గ్రహసంచారం వల్ల మీ మాటకు తిరుగుండదు. ఎంతటి కార్యాన్నైనా సులువుగా పూర్తిచేయగలరు. చేయు వృత్తి వ్యాపారాలందు రాణింపు ఉంటుంది. వ్యవహారానుకూలత. శతృజయం, ప్రతి విషయంలో మీదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. ప్రమోషన్స్ లాభించును.


వృషభం


ఈ నెలయందు మిశ్రమ ఫలితాలు. చేయువృతి వ్యాపారాలు అనుకూలించును. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం సహకరించును. నూతన వస్తు వస్త్రాప్రాప్తి. వ్యవహారానుకూలత, బంధు మిత్రులను కలుసుకుంటారు. స్పెకులేషన్ అనుకూలత. దూరప్రాయణాలు చేయుదురు. మాసాంతంలో స్వల్పంగా విరోధాలు. సూతకములు.


VRUSHABAM


ఈ నెలలో గ్రహచారం కొంతమేరఅనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు అన్నిరంగములవార్కి బాగుంటుంది.ఆదాయం వృద్ధి, ఆరోగ్యం బాగుంటుంది.ధైర్యంగా ముందుకు పోగలరు.బంధుమిత్ర సమాగమము. వాహనసౌఖ్యం.వ్యవహారానుకూలత,నూతన వస్తు ప్రాప్తి,చోరుల వలన భయం,సంతానసౌఖ్యం, భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును.


వృషభం


ఈ నెలయందు మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్నింటిలో జయం, కొన్నింటిలో అపజయం, ఆర్థికంగా ఫర్వాలేదని పించును. ఆశించినంత వ్యాపారాలు జరగవు. ప్రతీనిముషం టెన్షన్ గా ఉంటుంది. పనులందు శ్రద్ధ చూపలేరు. కుటుంబ వ్యక్తులతో తరుచుగా చికాకుగా ఉంటారు. కావలసిన వారి వల్ల అవమానములు.


వృషభం


ఈ నెలయందు అనుకూల గ్రహసంచారం వల్ల చేయు వృత్తి, వ్యాపారాలు అన్ని రంగాల వార్కి లాభించును. ధనలాభం, ఆరోగ్యం బాగుంటుంది. దైవసంబంధ కార్యాలు చేయుదురు. వ్యవహారజయం, కొన్ని విషయాలలో మధ్య వర్తిత్వం చేయుదురు. ధైర్యంతో ముందుకు పోగలరు. భార్యతో సఖ్యత, సంతాన సౌఖ్యం.


Gemini


ఈ నెలలో గ్రహసంచారం బాగుండుటచే చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలించును, ఆరోగ్యం బాగుటుంది. ఆర్థికంగా బలపడుదురు. ప్రతీ విషయంలో ధైర్యంతో ముందుకు పోగలరు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించును. భార్యా భర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ప్రయాణ సౌఖ్యం, దైవసందర్శనలు.


మిధునం


ఈ నెలలో ప్రధమర్ధంలో బాగుంటుంది. వ్యాపార వ్యవహారాలు లాభించును. నూతన వస్త్ర, వస్తు, వాహన లాభములు, విలువైన వస్తువులు లభ్యం, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో ఆనందకర జీవనం, ద్వితీయార్ధంలో 8 వ ఇంట గ్రహసంచారం వలన సమస్యలు ఉత్పన్నమగును.


MIDHUNAM


ఈ నెలయందు కూడా అనుకూలత ఉండదు. వ్యాపారాలు రాణింపు ఉండదు. ఆర్ధిక సమస్యలుంటాయి. మనోధైర్యం కోల్పోవుదురు. లోలోపల భయాందోళనకు గురి అగుదురు. శారీరక శ్రమ అధికం, మాసాంతంలో పరిస్థితులు చక్కబడును, సంఘంలో పరపతి పెరుగును. సమయానికి ఇతరుల సహాయ సహకారములు లభించును. ఉద్యోగులకు కొంత కష్టంగా ఉంటుంది. నూతన పరిచయ లాభాలు.


మిధునం


ఈ నెలయందు కూడా పరిస్థితులు మీకు అనుకూలించును. వ్యవహారజయం, ఆర్ధికంగా బాగుంటుంది. స్నేహితులవల్ల సమస్యలు తొలగును. ప్రయాణాలు చేయవలసి వచ్చును. స్త్రీవిరోధాలు తప్పవు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు. కోపతాపాలతో ఉండును. సంతాన సౌఖ్యం. గృహ నిర్మాణాది పనులు కలిసి వచ్చును.


మిధునం


అన్నిరంగాల వార్కి చేయు వృత్తి వ్యాపారములు అభివృద్ధి, ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించును. ప్రతీ విషయంలో ధైర్యంతో ముందుకుపోగలరు. బంధుమిత్రుల కలయిక,కుటుంబ సంతోషాలు, అప్రయత్న ధన లాభాలు, పెద్దవారిని కలుసుకుంటారు. దైవ సంబంధ కార్యాలందు పాల్గొంటారు.


Cancer


ఈ నెలలో గ్రహసంచారం బాగుండుటచే చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలించును, ఆరోగ్యం బాగుటుంది. ఆర్థికంగా బలపడుదురు. ప్రతీ విషయంలో ధైర్యంతో ముందుకు పోగలరు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించును. భార్యా భర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ప్రయాణ సౌఖ్యం, దైవసందర్శనలు.


కర్కాటకం


 ఈ నెలలో కూడా గ్రహాల అనుకూల సంచారం వలన అన్నింటా జయం. ఆదాయం బాగుంటుంది ,సరైన సమయానికి ధనం చేతికందును, నూతన వస్తు, వస్త్ర, వాహన లాభం, పాత మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలు, స్పెక్యులేషన్ లాభములు. కుటుంబ సౌఖ్యం ప్రయాణ సౌఖ్యం.


KARKATAKAM


ఈ నెలయందు మిశ్రమఫలితాలుంటాయి. ఆదాయంనకు లోటుండదు.సమయానికి ధనం చేతికందును. జన్మరాశిలో కుజునివల్ల చికాకులు అధికం.ప్రతీ చిన్న విషయానికి ఉద్రేకపడుదురు. అందరితోనూ పరుషంగా మాట్లాడుదురు.కోపం అధికం.కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులు.వాహన ప్రమాదాలు.


కర్కాటకం


ఈ నెలయందు గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. మీ మాటకుఎదురు ఉండదు. ఏ కార్యమైనా ఇట్టే పూర్తి అగును. ఆదాయం బాగుంటుంది.ఆరోగ్యలాభం, ధైర్యం పెరుగును. పిరికితనం ఉండదు. ఎంతటి వారితోనైనా మాట్లాడగలరు. భార్యా భర్తల మధ్య అనురాగం పెరుగును. దైవదర్శనములు,


కర్కాటకం


ఈ నెలయందుకూడా అనుకూల వాతావరణమే ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఆదాయంవృద్ధి, ఆరోగ్యం కుదుటపడును. పనులు మీకు అనుకూలంగా పూర్తిఅగును. ప్రభుత్వ వ్యవహారాలందుజయం, భూసంబంధ వ్యవహారానుకూలత, నూతనపరిచయలాభాలు. గౌరవ, మర్యాదలు పెరుగును. దైవదర్శనాలు.


Leo


ఈ నెలలో అంత అనుకూలత ఉండదు. ప్రతీ చిన్న విషయానికి ఆందోళన,అందరితోనూ విరోధాలు. వ్యవహారాలందు నష్టాలు. చీటికి మాటికి అందరితోనూ గొడవపడుట, పరుషపదజాలం వాడుటవల్ల కార్యాలందు అపజయం. స్వల్పంగా ఆరోగ్య భంగాలు, భార్యాభర్తల మధ్య అవగాహన ఉండదు. స్త్రీ సుఖం తక్కువగా ఉంటుంది.


సింహం


అన్ని విధాలుగా బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. వ్యవహార అనుకూలత, నూతన వాహన, వస్త్ర, వస్తులాభాలు, పాత మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలు , స్పెక్యులేషన్ అనుకూలత లాభం . పోటీలలో పాల్గొని విజయం సాధిస్తారు. ఆనందంగా సంతోషకరంగా జీవనం సాగిస్తారు.


SIMHAM


ఈ నెలలో చేయు వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.ఆర్ధికంగా నిలద్రొక్కుకుంటారు. వ్యవహరానుకూలత. సమస్యల నుండి బయటపడతారు. వాహనసౌఖ్యం.ఇల్లు మారుట జరుగును. వివాహాది శుభకార్యాలకు హాజరగుదురు. సంతానంవల్ల సంతోషవార్తలు వింటారు.సంఘంలో మీ స్థితి బాగుంటుంది. శతృవులపై ఆధిక్యత.


సింహం


ఈనెలయందు కూడా పరిస్థితులు అనుకూలించును.వ్యవహారాలందు మీదే పైచేయి అగును. ఎంతటి పనైనా సులువుగా పూర్తి. కోర్టు వ్యవహారజయం.శతృవులే మిత్రులగుదురు. కుటుంబ సహాయ సహకారములు బాగా లాభించును.వ్యతిరేకత ఉండదు. సంఘంలో ఉన్నత స్థితి. మీ మాటకు ఎదురుండదు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. కళత్ర,సంతాన సౌఖ్యం కలుగును.


సింహం


ఈ నెలయందు అనుకూల గ్రహసంచారంవల్ల అన్నిరకాల వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ఆదాయంనకు లోటుండదు. వ్యవహారానుకూలత. ధైర్యంగాఉండుట. ఆరోగ్యలాభం, ఇతరుల విషయంలో జోక్యం చేసుకొనుట, దైవసంబంధకార్యాలందుపాల్గొనుట,వాహనసౌఖ్యం, కుటుంబసౌఖ్యం,సంతానసౌఖ్యం, స్త్రీ సౌఖ్యం.


Virgo


ఈ నెలయందు కూడా చేయు వృత్తి వ్యాపారములు బాగుండును. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యలాభం, శతృవులపై జయం. ధైర్యంతో ముందుకు పోగలరు. ప్రతీ విషయంలోనూ మీదే పైచేయి. సంతానం ద్వారా సంతోష వార్తలు వింటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. బంధుమిత్ర సమాగమములు.


కన్య


గ్రహాల అనుకూల సంచారం వల్ల మీ మాటకు ఎదురు ఉండదు. అన్ని రంగాల వారికి బాగుంటుంది. ధనలాభం, నూతన వస్తు, వస్త్ర ,యశోభూషణప్రాప్తి, ప్రయాణ సౌకర్యం, పాత మిత్రులను కలుసుకొనుట. బంధు మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో, స్పెక్యులేషన్ అనుకూలం. సంతోషంగా జీవనం ఉంటుంది.


KANYA


ఈనెలయందు అన్నిరంగాల వార్కి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా కలిసివచ్చును. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం వృద్ధి, ధైర్యంతో ముందుకు పోగలరు. ప్రయాణాలు కలిసివచ్చును. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలించును. సంఘంలో మీ పరపతి పెరుగును. హోదా కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు.


కన్య


ఈ నెలలో ప్రధమార్ధం బాగుండదు. ద్వితీయార్ధం బాగుంటుంది. ప్రధమార్థంలో పనులు స్తంభించుట అకారణ విరోధాలు, ద్వితీయార్థంలో అన్ని రంగాలవార్కి యోగమే. ఆదాయం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం, దైవసందర్శనలు. తీర్ధయాత్రా ఫలప్రాప్తి వ్యవహారజయం. సంతానసౌఖ్యం, నూతన పరిచయలాభములు.


కన్య


ఈనెలలో జన్మంలో గ్రహసంచారం వల్ల కోపం అధికం. మాటలు పరుషంగా మాట్లాడుటవల్ల పనులు నిలిచిపోవును. చేయు వృత్తి వ్యాపారాలు అంతగా బాగుండవు. ఆదాయంనకు ఇబ్బందులు. ప్రతీ విషయంలో వ్యతిరేకత ఉంటుంది. కార్యాలు ఫలించవు. స్త్రీవిరోధాలు, సౌఖ్యం తక్కువ. శారీరకశ్రమ అధికంగా ఉంటుంది.


Libra


అన్నిరంగాలవార్కి చాలా బాగుంటుంది. మీ మాటకు తిరుగుండదు. పట్టిందల్లా బంగారమా అనునట్లుండును. ఎంతటి వారితో నైనా మాట్లాడగల నైపుణ్యం ఉంటుంది. పనులు అవలీలగా పూర్తిచేయగలరు. ఆదాయంనకు లోటుండదు. ఆరోగ్యం బాగుంటుంది. శతృవులపై ఆధిక్యత, వాహన సౌఖ్యం, వ్యవహారలాభం.


తుల


అన్ని విధాలుగా బాగుంటుంది. వ్యాపార వ్యవహారంలో లభించును .ఆదాయం లోటుండదు, నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి , పాత మిత్రులను కలుసుకుంటారు. దూరప్రయాణాలు కలిసి వచ్చును , బంధు మిత్రులతో కలిసి విందులు , వినోదములు, కుజ ప్రభావం వల్ల కఠినంగా మాట్లాడుదురు. శారీరక గాయములు.


THULA


ఈ నెలయందు ప్రధమార్థం బాగుండదు. పనులందు ఆటంకములు, ఆరోగ్యభంగము, ధనంకు ఇబ్బందులు. ద్వితీయార్ధం గ్రహ సంచారం అనుకూలంగా ఉండుట వలన చేయు వృత్తి వ్యాపారములందు లాభాలు. అనుకున్నది సాధించుట, వ్యవహార జయం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. సంతాన సౌఖ్యం.


తుల


ఈ నెలలో జన్మరాశిలో గ్రహసంచారం కొంతమేర బాధించును. ఏ పని చేయబుద్ధి కాదు. కోపం అధికంగా ఉంటుంది. ప్రతీ చిన్న విషయానికి ఆవేశ పడుదురు. పౌరుషంగా మాట్లాడుట వల్ల అకారణ విరోధాలు. వాహన ప్రమాదాలు జరుగును. తొందరపాటు తగ్గించుకోవలెను. బంధుమిత్రులతో మాట పట్టింపులు, స్త్రీ సౌఖ్యం ఉండదు.


తుల


ఈనెలయందు గ్రహసంచారం అనుకూలంగా లేదు. అన్నింటా అపజయమే. ఆర్థిక సమస్యలుంటాయి. చిన్నచిన్న రుగ్మతలు ఉంటాయి. భార్యకు కూడా ఆరోగ్యభంగము, సోదరమూలక నష్టాలు, భూ సంబంధ వ్యవహారాలందు నష్టాలు, అనుకున్న పనులు మధ్యలో నిలిచిపోవును. శారీరకశ్రమ అధికమే. అకాల భోజనాలు.


Scorpio


ఈ నెలయందు గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందున చేయువృత్తి వ్యాపారాలందు అనుకూలత. ప్రతి విషయంలో ముందంజలో ఉంటారు. నూతన వహన ప్రాప్తి కార్యానుకూలత, ఉద్యోగులకు అనుకూల సమయం. సంతాన సౌఖ్యం, కుటుంబంలో సఖ్యత, బంధుమిత్ర సమాగమం. విందులు, వినోదాలలో పాల్గొంటారు.


వృశ్చికం


ఈ నెలలో అన్ని రంగాల వారికి బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో  రాణించును, ఆదాయం బాగుండును, ఆరోగ్యం బాగుంటుంది. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి, దూర ప్రయాణాలు కలిసి వచ్చును. పాత మిత్రులను కలుసుకుంటారు . మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో, స్పెక్యులేషన్ అనుకూలం.  స్త్రీ మూలక  ధనలాభం.


VRUSCHIKAM


ఈ నెలయందు మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్నింటి యందు జయం, కొన్నింటి యందు అపజయం. ఆరోగ్యభంగాలు, ఉష్ణజ్వరపీడలు. నేత్ర, శిరోబాధలుంటాయి. వృత్తివ్యాపారాల ద్వారా ఆదాయం బాగుంటుంది. భూసంబంధ వ్యవహారాలు లాభించును. సంతాన సౌఖ్యం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది..


వృశ్చికం


ఈ నెలలో ప్రధమార్థం బాగుండును. ద్వితీయార్ధంలో ఊహించని సమస్యలు. ఆదాయంనకు మించిన ఖర్చులు. ఋణాలు చేయవలసి వచ్చును. వాహన ప్రమాదాలు. వ్యవహార నష్టాలు. ఆరోగ్య భంగాలు,మీ యొక్క విలువను పోగొట్టు కొంటారు. నేత్ర శిరో బాధలు ఉంటాయి. జాయింటు వ్యాపారులకు ఇబ్బందులుంటాయి. స్త్రీ సౌఖ్యం.


వృశ్చికం


ఈ నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది. 12వ ఇంట శుక్రుని వల్ల స్త్రీ విరోధములు, భార్యకు స్వల్పంగా ఆరోగ్యభంగాలు. కళత్ర వంశ పీడలు. స్వల్పంగా ఆరోగ్యభంగాలు. కళత్ర వంశ పీడలు, స్వల్పంగా అగౌరవం పొందుట, అవమానాలు, వ్యాపారపరంగా, వృత్తిపరంగా అనుకూలమే. ఆర్ధిక లావాదేవీలు బాగుంటాయి.


Sagittarius


ఈ నెలలో గ్రహసంచారము అనుకూలంగా లేదు.చేయు వృత్తి వ్యాపారాలుఅనుకూలించవు. ఆర్ధిక సమస్యలుంటాయి. ఒత్తిడి పెరుగును. ఆరోగ్యభంగములు తప్పవు. ప్రతీనిముషము టెన్షన్ గా ఉంటుంది. కుటుంబ సభ్యులపై కోపంతో ఉంటారు. అకాల భోజనాలు, కార్యాలందు ఆటంకాలు. ప్రయానాలందు కష్టములు.


ధనస్సు


ఈ నెలలో కొంతవరకు బాగుంటుంది, చేయువృత్తి వ్యాపారులు కలిసి వచ్చును. నూతన వాహన , వస్తూ, వస్త్ర ప్రాప్తి , దూర ప్రయాణాలు చేయరు. పాత మిత్రులను కలుసుకుంటారు . బంధు మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో , ఆనందంగా ఉత్సాహంగా ఉండును. సంతాన  సౌఖ్యం కుటుంబ సౌఖ్యం.


DHANASSU


ఈ నెలలో 8వ ఇంట కుజప్రభావం వల్ల అనుకూలత ఉండదు.శారీరక శ్రమఅధికం .అలసట ,అకాలభోజనాలు, గృహమార్పులు , స్థానచలనాలు, శారీరక  గాయాలు, రక్తం కళ్ళచూచుట, వాహన ప్రమాదాలు , సోదరవర్గంవారితో విరోధాలు, కుటుంబ వ్యక్తులతో కలహాలు.ప్రతీ విషయంలో ఆచితూచి మాట్లాడాలి. భూసంబంధ వ్యవహారాలు అనుకూలించవు. సంతానమునకు ఆరోగ్యభంగములు


ధనస్సు


చేయు వృత్తి వ్యాపారములందు అన్నిరంగాల వార్కి బాగుంటుంది.ఆదాయంబాగుంటుంది. కుటుంబసమస్యలు తొలగిపోవును. తీర్థయాత్రా ఫల ప్రాప్తి నూతన వాహనం గాని విలువైన వస్తువులను కొంటారు. ప్రతీ విషయంలో మీరే పైచేయి. భార్యకు స్వల్పంగా ఆరోగ్యభంగాలు, కళత్రవంశ అరిష్టాలు, సూతకాలు


ధనస్సు


ఈనెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అనుకున్నది సాధిస్తారు.కోర్టు వ్యవహారములు అనుకూలించును. దైవసంబంధ కార్యాలందు పాల్గొంటారు. ఆదాయంనకులోటుండదు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు అనుకూలించును. మిత్రులతో కలిసి విందులు, వినోదాలు, సంతోషవార్తలు వింటారు. సంతానసౌఖ్యం


Capricorn


ఈనెలలో గ్రహసంచారం అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు, మాట్లాడితే విరోధం. ప్రతిచిన్న విషయానికి గాబరాపడుదురు. భార్యకు,ఆరోగ్యభంగాలు తప్పవు. శారీరకశ్రమ అధికం. అకాలభోజనాలు, అలసట, నిద్రలేమి ఉంటుంది. పనులు మధ్యలో నిలిచిపోవును. సంఘంలో పరపతి కోల్పోవుదురు.


మకరం


బాధలు అనేకం ఉంటాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. స్పెక్కులేషన్లో అధికనష్టాలు, వస్తువులు పోగొట్టుకుంటారు. స్త్రీ విరోధములు, సంతానమునకు ఆరోగ్యభంగములు, ఆదాయం కూడా అంతంత. వ్యావహారాదులందు నష్టములు. ఇతరులచే అవమానింపబడుదురు.


MAKARAM


ఈ నెలయందు మిశ్రమఫలితాలుంటాయి. ప్రతిచిన్న విషయానికికోపం వస్తుంది. అందరితోనూ కఠినంగా వ్యవహరిస్తారు. పౌరుషంగా మాట్లాడుట వల్ల కొన్ని పనులు నిలిచిపోవును. సోదర వర్గంతో విరోధాలు, కుటుంబంలో కూడా విరోధాలే. సంతానంకు స్వల్పంగా ఆరోగ్య భంగాలు.సంఘంలో వ్యతిరేకత ఉంటుంది . ఆలోచనలు లేకుండా పనులు చేయుటవల్ల నష్టపోవుదురు. కుటుంబ సౌఖ్యం తక్కువ


మకరం


ఈ నెల గ్రహస్థితులుఫర్వాలేదు. మీకు అనుకూలంగానే ఉన్నవి. ఆదాయం ఎంతవచ్చినా మంచినీళ్ళవలెఖర్చు అగును. పనులందుబద్దకం. ఆలస్యమగును. ఆటంకాలు ఎదురైనా చివరినిముషంలో పూర్తిఅగును. సంఘంలో గౌరవం తిరిగి సంపాదిస్తారు. కుటుంబంలో సఖ్యత, సంతాన సౌఖ్యం, నూతన పరిచయలాభం.


మకరం


ఈ నెలయందు పరిస్థితులు కొంత మేర అనుకూలించును. చేయువృత్తి వ్యాపారాలందు అన్ని రంగములవార్కి బాగుంటుంది. ఆర్థికంగా లోటురాదు. సరైన సమయానికి ఏదోలాధనం చేతికందును. భార్య ఆరోగ్యం కుదుటపడును. సరైన అవగాహన ఉంటుంది. వ్యవహారాలు చివరినిముషంలో ఆందోళనతో పూర్తి అగును.


Aquarius


ఈ నెలలో కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి గాబరా పడుదరు. ఆరోగ్యభంగాలు తప్పవు. సోదర మూలక విరోధాలు ఏమి మాట్లాడిన విరోధమే. ఆచితూచి  వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య చీటికి, మాటికి గొడవలు వచ్చును. విరోధంగా ఉంటారు. సౌఖ్యం చాలా తక్కువ. సంతానమునకు ఇబ్బందులే.


కుంభం


ఈ నెలలో పరిస్థితులు అంతగా అనుకూలించవు. చేయు వృతివ్యాపారాలు అంతంత మాత్రమే. దూరప్రాయణాలు చేస్తారు. నూతన వస్త్ర , వస్తుప్రాప్తి ,పాత మిత్రులను కలుసుకుంటారు. స్పెక్కులేషన్ లో నష్టములు. బంధు మిత్రులతో విందులు, వినోదాలు, అయినా మానసికంగా కృంగిపోతారు. విరోధములు.


KUMBHAM


ఈ నెలయందు కూడా గ్రహసంచారం అనుకూలంగా ఉంది.పనులు త్వరితగతిని పూర్తి.ఆర్ధికంగా బాగుంటుంది.రావలసిన బాకీలు వసూలగును.సమస్యలు పరిష్కారమగును.అందరూ మిమ్మల్ని గౌరవించెదరు.కుటుంబంలో సఖ్యత.శత్ర జయం సంతాన సౌఖ్యం.శుభకార్యాములకు హాజరగుట. స్త్రీ సౌఖ్యం .


కుంభం


ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండుటచే అన్ని రంగాల వారికి చేయు వృత్తి వ్యాపారాలందు రాణింపు ఉంటుంది. ఆదాయంనకు లోటుండదు . వ్యవహార జయం, ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం, ఉద్యోగస్తులకు అనుకూలమే. భార్యాభర్తలమధ్య సరైన అవగాహన ఉంటుంది, కుటుంబసౌఖ్యం.


కుంభం


ఈ నెలలో కూడా అనుకూలత ఉండదు. పనులందు ఆటంకములు. ఏపనీ చేయబుద్ది కాదు. అలసట, శారీరక శ్రమ ఆధికం ఆకల భోజనం . వాహన ప్రమాదం . శారీరక గాయాలు . అందరితోనూ విరోధాలే. నూతన సమస్యలు ఏర్పడును . దైవ సంబంధ కార్యములందు పాల్గొంటారు. వ్యవహారములు అనుకూలించవు.


Pisces


ఈ నెలలో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాదులకు బాగుగా సాగును. ఉద్యోగులకు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది . ధనమునకు లోటుండదు .సరైన సమయనికే ధనం చేతికందును. శత్రువులపై ఆధిక్యత, వాహన రిపేర్లు చేయిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. సోదరమూలక సహాయం లాభించును.


మీనం


అన్నీ విధాలుగా చాలా బాగుంటుంది. ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు వచ్చును. ఆరోగ్యంగా, ఆనందంతో ఉంటారు.దూర ప్రయాణాలు చేయుట, పాతమిత్రులను కలుసుకొనుట, భందుమిత్రులతో కలిసి విందులు, వినోదములు, ఉల్లాసంగా ఉంటారు.స్పెక్కులేషన్లో లాబాలు. పెద్దవారిని కలుసుకొనుట జరుగును. అన్నీ అనుకూలంగా మీరు అనుకున్నట్లుగా పనులు చేయుదురు. నూతన వస్తు, వస్త్రాప్రాప్తి.


మీనం


ఈనెల యందు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున చేయు వృత్తి వ్యాపారాలందు  అన్ని రంగముల వారికి బాగుంటుంది .ఆదాయంనకు లోటు ఉండదు ,ఆరోగ్యం బాగుంటుంది .ప్రతి విషయంలో ధైర్యంతో ఉంటారు .మిత్రుల సహాయ సహకారములు లాభించును .వాహన సౌఖ్యం, సంతాన సౌఖ్యం.


మీనం


ఈ నెలయందు చేయు వృత్తి వ్యాపారాలు బాగుండును.ఆర్ధికలావాదేవీలు సంతృప్తి నిచ్చును.సమస్యలు పరిష్కారమగును. మీ మాటకు ఎదురుండదు. వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి అగును.గౌరవమర్యాదలు పెరుగును.నూతన పరిచయలాభము. సంతానసౌఖ్యం.వివాహాది శుభకార్యములకు హాజరగుట.


2022


మేషం


మేషం 2021

రాజపూజ్యం - 4 అవమానం-3 ఆదాయం - 8 వ్యయం -14

ఈ రాశివారలకు ధనకుటుంబ కారకుడైన గురుడు కుంభంలోనూ, రాజ్య, లాభాధిపతి శని మకరంలో ఉండుటచేతను, ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగ బలముచే జీవితంలో ఎన్నడూ లేని ఔన్నత్యం పొందుదురు. మంచియోగ బలం ఉంది. వ్యవహార నిపుణత, ధన,కుటుంబ, గౌరవ, అధికార అనుగ్రహం సంసార జీవితంలో ఉత్సాహము, ప్రోత్సాహములు సిద్ధించును. స్త్రీల సహాయంచే ఆనందం స్థిరాస్థిని వృద్ధి చేయుట, విలువైన వస్తువులు సమకూర్చుకొనుట. భూ గృహలాభాలు సేకరణ కలుగును. పట్టిందల్లా బంగారమా ? అనునట్లుండను.ప్రతీ విషయంలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. స్వశరీర, కళత్ర, సంతానం, ఆరోగ్యాల పట్ల నిరుత్సాహం. ధనవ్యయం కలిగించును. మీ చేతిమీద ఇతరుల కార్యములు పూర్తిచేయుటచే ధనవ్యయం. పెత్తనం వహిస్తారు. ఎంత శతృత్వం ఉన్ననూ క్రియకు జయం కలుగును. ఏదైనా స్థలం కొనుటలేక గృహనిర్మాణం చేస్తారు. నష్టద్రవ్య లాభాలు కలుగును. షుగర్, బి.పి.వంటి వ్యాధులు ప్రారంభించి కొంత బాధించును. చిక్కు సమస్యలచే మనస్తాపం, అపనిందలు, నూతన పరిచయాలువల్ల లాభాలు. గురుబలం వల్ల ఎన్నితప్పుడు, అవినీతి పనులు చేసినా కమ్ముకుపోవును. గాన అధైర్యం చెంద వలదు. అనేకము లైన సాంఘిక కార్యక్రమాలు చేపట్టుట జరుగును. రాహు,కేతు ప్రభావంచే సుదూర ప్రయాణాలు, తీర్ధయాత్రలు చేయుట జరుగును.

ఉద్యోగులకు ఈ సంవత్సరం ఉన్నంతగా ఉంటుంది. తప్పనిసరిగా ప్రమోషన్స్ లభించును. మంచి పేరును సంపాదిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నందు ఉన్నవారికి కోరుకున్నచోట ఉద్యోగములు పొందగలరు. ప్రమోషన్ కూడిన బదిలీలు నూతన వాహనప్రాప్తి, గృహ నిర్మాణాలు కలిసి వచ్చును. నిరుద్యోగులకు ఖచ్చితంగా జీవనం లభించును. ప్రవేటు సంస్థలలో పని చేయువారలకు ఉన్నత స్థితి. యజమానుల మన్ననలు పొందగలరు. చిన్న కంపెనీలో పని చేయు వారలకు బాగుంటుంది విదేశాలలో ఉద్యోగాలు పొందగలరు. అన్నిరంగాల వార్కి యోగదాయకమే.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పవచ్చు. ప్రజలలో గుర్తింపు, ఆదరణ బాగుంటుంది. అధిష్టాన వర్గంవారు కూడా మీ పై సదభిప్రాయంతో ఉంటారు. ఎన్నికలందు షోటి చేయినట్లైన కచ్చితంగా విజయం వరించును. నామినేటడ్ పదవైన తప్పక లభించును. విపరీతంగా  ధనంవ్యయం.

కళాకారులకు ఈ సంవత్సరం బాగుంటుంది గురుబలం బాగుంది. ప్రజలలో మంచిగుర్తింపుంటుంది. టి.వి. సినిమా రంగంలో ఉన్నవార్కి చాలా బాగుంటుంది. నూతన అవకాశములు బాగా వచ్చును.గాయనీ గాయకులు, దర్శకుల, రచయితలకు టెక్నిషియన్స్ కు మంచి కాలం.పని చేసిన వాటికి మంచి గుర్తింపు వస్తుంది.

వ్యాపారులకు ఈ సంవత్సరం అన్నిరకాల సువర్ణ అవకాశములు అందుకుంటారు.  అనుకున్నట్లుగా వ్యాపారములు సాగును. అన్నిరకముల వ్యాపారములు బాగుంటాయి. జాయింటు వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన ఉండుటచే లాభములు చేకూరును. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గతంలోకంటే కొంచెం మేలు. సరుకులు నిల్వచేయువారలకు విపరీత లాభములు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవార్కి ఫర్వాలేదనిపించును.

విద్యార్థులకు ఈ సంవత్సరం  జ్ఞాపకశక్తి బాగుంటుంది. గురుబలం బాగుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. చదువుపై శ్రద్ధ పట్టుదలతో ఉంటారు. ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్, ఆ సెట్,పాలిటెక్నిక్, బి.ఇడి, లాఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులతో కోరుకున్నచోట్ల సీట్లును పొందగలరు. క్రీడాకారులకు మంచి విజయాలు లభించును.జాతీయ, అంతర్జాతీయ జట్లలో ఎంపిక అగుదురు.

వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు ఫలించును. మంచి ఆదాయం వచ్చును. ఋణాలు తీర్చుతారు. ప్రభుత్వ సహాయం లభించును. గృహంలో శుభకార్యములు. అన్నిరకాల పంటలవార్కి బాగుంటుంది. చేపలు, రొయ్యలు, చెరుపులు చేయువార్కి ఫౌల్ట్రీరంగంవార్కి కౌలుదార్లకు అనుకూలించి లాభాలు కల్గును.

స్త్రీలకు :- ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. మీ మాటకు ఎదురుండదు.అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. మీ పేరుతో స్థిరాస్థులు ఏర్పడును.విలువైన ఆభరణాలు లభించును. ఉద్యోగాలు చేయువార్కి అధికారమన్ననలు. ప్రమోషన్ తో కూడిన బదిలీలు జరుగును. వివాహం కానివార్కి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన. గర్భిణీ స్త్రీలకు ఫ్రీడెలివరీ. పుత్ర సంతాన ప్రాప్తి కలుగును. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగును.మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నత స్థితి. గ్రహాలు స్థితులు మీకు అనుకూలం. మీ తెలివి తేటలకు, ధైర్య సాహసములకు గ్రహబలంతోడు అగుటవల్ల మీరు పట్టిందల్లా బంగారమా? అనునట్లుండును. గతంలో కంటే బాగుంటుంది. రాజయోగమును అనుభవించెదరు. దైవానుగ్రహము లభించును.

చేయవలసిన శాంతులు:-ఈ సంవత్సరం మీపై ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటివి. నరఘోష అధికంగా ఉంటుంది. గాన మంగళవారం మీ గ్రామంలో గల శివాలయములో అభిషేకం చేయించండి. శ్రీ శైల క్షేత్ర సందర్శన చేయండి. అన్నదానంమంచిది. నవగ్రహ,నరఘోషయంత్రాలు ధరించిన మంచిది.

 


వృషభం


వృషభరాశి (TAURUS)

కృత్తిక 2,3,4, పా॥లు రోహిణి 1,2,3,4, పా||లు మృగశిర 1,2 పా॥లు

రాజపూజ్యం -7    అవమానం-3    ఆదాయం- 2    వ్యయం -8

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారుకుడైన గురువు కుంభంలో యోగ కారుకుడైన శని మకరంలో ఉన్నందు వలన యోగబలముచే జీవితంలోమంచి యోగబలము.వ్యవహార నిపుణత, ధన, కుటుంబ, గౌరవం, అధికార అనుగ్రహం. సంసార జీవితాదులలో ఉత్సాహప్రోత్సాహములు సిద్ధించును. స్త్రీసహాయంచే ఆనందము, స్థిరాస్థిని వృద్ధి చేయుట, విలువైన వస్తువులను ధరించుటకొనుట. భూగృహలాభాదులు సేకరణ కలుగును. పనినేర్పరతతో ఇతరులనుమెప్పించి వ్యవహరించుటకలుగును. ఎవరు లేకుండా తమదే పరిపాలన అన్నట్లుండును. జన్మరాహువు. సప్తమకేతువు వలన ఆరోగ్య భంగములు తప్పవు. ఔషధసేవచేయవలసి వస్తుంది. స్వశరీర, కళత్ర,సంతానం ఆరోగ్యం పట్ల నిరుత్సాహం. ధనవ్యయం కలిగించును. మాతృ, పితృవంశ సూతకాలు తప్పకకలుగును. మీ చేతి మీద ఇతరుల కార్యాలపట్ల, ధనవ్యయం, పెత్తనం వహించుట జరుగును. ఎంతో శతృత్వం ఉన్న చివరకు జయం కలుగును. ఏదైనా స్థలం కొనుట గృహనిర్మాణం చేయుదురు. ప్రతివిషయంలో మంచి ప్రోత్సాహం ఉంటుంది. అన్నిరంగాల వార్కి స్థిరత్వం, లాభాలు పొందుదురు. షుగర్,బి.పి.వంటి దీర్ఘ వ్యాధులు సంప్రాప్తించును.కొన్ని చిక్కు సమస్యలు వల్ల మనస్థాపం. ధనం,సంపత్తులు, కుటుంబమునకు కారకుడైన గురువువల్ల ఎన్నితప్పుడు పనులు చేసినా కమ్ముకుపోవును. అధైర్యం చెందవలదు. స్త్రీల వలన సమస్యలు తొలగిపోవును. రాహు, కేతు, ప్రభావం వలనకొంత కృంగదీయును. అయినా చివరి నిముషంలో మీదే పై చేయి అగును.

ఉద్యోగులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. అధికారుల అనుగ్రహం.కోరుకన్న ప్రదేశాలకు ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు. మీ మాటకు విలువ,గౌరవం పెరుగు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఇంక్రిమెంట్లు పెరుగును. నూతన గృహనిర్మాణాలు కలిసి వచ్చును. నిరుద్యోగులు ఖచ్చితంగాఈ సంవత్సరం స్థిరపడుదురు. ప్రవేటు సంస్థలలో పనిచేయువారలకు ఈ సంవత్సరం పర్మినెంట్ అగును.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కూడా మంచి యోగకాలమే. అనిచెప్పవచ్చును. ప్రజలలో ఆదరణ బాగుంటుంది. అధిష్ఠానవర్గంలోను అనుకూలవాతావరణం ఉంటుంది. ఎన్నికలలో పోటీ చేసినట్లయితే విజయం ఖాయం.కనీసం నామినేటడ్ పదవి లభిస్తుంది. జన్మంలోరాహువు వలన శతృమూలక ఇబ్బందులు. కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుగా ఉండుటచేతచేయు ప్రయత్నాసమయం. ప్రభుత్వ ప్రవేటు సంస్థల ద్వారా ఇచ్చే అవార్డు, రివార్డులు తప్పకలభించున్నలకు బాగుంటుంది. అనుకున్న లాభాలుపొందగలరు.

వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం, అన్నిరకాల వ్యాపారులకు బాగుంటుంది. అనుకున్న లాభాలుపొందగలరు.హోల్ సేల్ మరియు రిటైల్ వ్యాపారాలకు బాగుంటుంది. సరుకులు నిల్వచేయువారలకు ఆశించిన దానికంటే లాభాలు పొందగలరు.రియల్ ఎస్టేట్ లో ఉన్నవార్కి గత సంవత్సరం కంటే బాగుంటుంది.

విద్యార్థులకు ఈ సంవత్సరం కూడా గురుబలం బాగుంది. జ్ఞాపకశక్తి ఉంటుంది.ఇతర వ్యాపకాలు ఉండక చదువుపై శ్రద్ధ పెడతారు. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. ఇంజనీరింగ్ మెడికల్, ఈసెట్, ఆసెట్, లాసెట్, బి.ఇడి. మొ॥గు ఎంట్రన్సు పరీక్షలందు ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలోసీట్లనుపొందగలరు. క్రీడాకారులకు విజయాలు,జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం వ్యవసాయదారులకు ఈ సంవత్సరం బాగుంటుంది. జన్మంలో రాహువు వలసకొంత దిగుబడి తగ్గును. ధరలు బాగుండుటచే సంతోషంతో ఉంటారు. ప్రభుత్వసహాయంలభించును. కౌలుదార్లకు అనుకూలమే. పండ్లతోటలు,నర్సరీ వ్యాపారులకు మంచిలాభాలువచ్చును. చేపలు, రొయ్యల చెరువులవార్కి విశేష లాభములు.

స్త్రీలకు:- ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. గురు శనుల బలం బాగుండుటచేమీమాటకు ఎదురుండదు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీ పేరుతో స్థిరాస్తులుకొంటారు. భార్యాభర్తల మధ్య సరైనఅవగాహన ఉంటుంది. భర్తకూడా అన్ని విధాలుగా సహకరిస్తారు. విలువైన ఆభరణాలు కొంటారు. ఉద్యోగం చేయు స్త్రీలకుఅధికారుల అనుగ్రహంతో కోరుకున్న ప్రదేశములకు ప్రమోషతో కూడిన బదిలీలు జరుగును. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరిగితీరును.గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అగును. స్త్రీ సంతాన ప్రాప్తి, గతంలో విడిగా ఉన్నవారు ఈ సంవత్సరం తప్పక కలుస్తారు. జన్మరాహువు వలన కొన్ని విలువైన వస్తువులు పోగొట్టు కుంటారు. తండ్రి, తల్లి, భర్త తరపువార్కి అరిష్టములు జరుగును.

చేయవలసిన శాంతులు:- ఈ సంవత్సరం జాతకబలం బాగుండుటచే మీపై ఈర్ష్య,అసూయ, నరఘోష అధికంగా ఉంటుంది. గాన మంగళవారం మీ గ్రామంలో శివాలయంలో అభిషేకం చేయాలి. శ్రీశైలక్షేత్రం దర్శించండి. రాహు, కేతు, నరఘోష యంత్రాలు ధరించిన మంచిది.


మిధునం


మిధునరాశి (GEMINI)

మృగశిర 3,4 పాదములు ఆరుద్ర 1,2,3,4 పాదములు పునర్వసు 1,2,3 పాదముల

ఆదాయం - 5        వ్యయం - 5           రాజపూజ్యం - 3                  అవమానం - 6

ఈ రాశి స్త్రీ పురుషాదులకు సప్తమ రాజ్యాధిపతియైన గురువు 9వ స్థానం కుంభంలో శని, 8వ ఇంట రాహువు, 12వ యింట కేతువులతో ఉండుట వల్ల గురువు బలంగా ఉన్నప్పటికీ, శని వల్ల మిశ్రమ ఫలితంగా ఉంటుంది. శక్తి మించి పనులుచేసి అవమానాలు పాలగుదురు. ప్రతీవిషయంలో ఒత్తిడి అధికంగాఉంటుంది.సంఘంలో, గౌరవం, పలుకుబడి కొంతమేర తగ్గును అవమానకర సంఘటనలను ఎదుర్కొనవలసివచ్చును. ఇతరులకు హామీలు, జామీనులుండుట వల్ల అధికంగా నష్టపోవుదురు. రాహువువల్ల దూరప్రయాణాలు తీర్థయాత్రా ఫలప్రాప్తి పితృమాతృవంశ సూతకములు తప్పవు. సంతానం రజస్వల వంటి శుభములు జరుగును. బంధుమిత్రుల కలయిక. భూగృహసంబంధలావాదేవీలతో నష్టపోవుట జరుగును. మధ్యవర్థిత్వం వలన అపనిందలకు గురిఅగుదురు. ఇల్లుమారుట లేదా స్థానచలనములు తప్పక కలుగును. ఎంత కష్టించి పనిచేసినా ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది. నిరుత్సాహంకు గురిఅగుదురు. ప్రభుత్వమూలక్త పనులు మధ్యలో నిలిచిపోవును. గురుబలం ఉన్నందువలన చివరినిముషంలో మీ పరువు నీలబెట్టుకొంటారు. వాహనప్రమాదములు, శస్త్రచికిత్స జరుగును. ప్రతీ చిన్న విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయినా తప్పటడుగు వేయుటతప్పదు. మీ మాటచాతుర్యముచే కొన్ని పనులలో జయం సాధిస్తారు.

ఈ సంవత్సరం ఉద్యోగులకు ఫర్వాలేదనిపించును. సాఫీగా జీవనం సాగును.మిశ్రమ ఫలితాలుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందు పనిచేయువారలకు సామాన్యంగాఉండును.గృహనిర్మాణాలునిలిచిపోవును. ఋణాలుసరైనసమయానికి అందవు.నిరుద్యోగులకు ఈసం॥కొంత ఆశాజనకంగాఉన్ననూ కొన్నివర్గాలవార్కి ఉద్యోగాలువచ్చును. పర్మినెంట్ కానివార్కి ఈ సం॥రంకూడా నిరాశేఎదురగును .ప్రవేటు సంస్థలలో పనిచేయువారలకు మరొకకంపెనీలకుమారుదురు. చిన్నకంపెనీ లందు  పనిచేయువారలకు జీతాలు పెరుగును. విదేశీ ప్రయత్నాలు ఫలించును.

రాజకీయ నాయకులకు సంవత్సరంలో అంత అనుకూలంగా లేదు. శని బలంలేదు.8వ ఇంట శనికారణంగా రావలసినపదవులు మీకు రాకుండా చివరి నిముషంలో నిలిచిపోవును.అధిష్ఠానవర్గంలోకూడా మీపై సదాభిప్రాయం ఉండదు. శతృవులు మీపై వ్యతిరేకంగా చెబుతారు. నామినేటడ్ పదవులుకుడా లభించుట కష్టమే అగును.

కళాకారులకు కూడా కష్టంగానే ఉంటుంది. విజయ అవకాశాలు తక్కువ. ప్రజాదరణ, నూతన అవకాశాలు అంతంత మాత్రమే. ట్రి.వి, సినిమా రంగంలో ఉన్నగాయనీ గాయకులకు రచయుతలకు ,దర్శకులకు టెక్నీషియన్స్ కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం తగ్గును. కార్యములు మధ్యలో నిలిచిపోవును.

వ్యాపారస్తులకు ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలుండును. కొన్నిరకాల వ్యాపారాలు బాగుండును . జాయింటు వ్యాపారులకు మాత్రం బాగుంటుంది. హోల్ సెల్,రిటైల్ రంగంలో ఉన్నవార్కి ఫర్వాలేదు. ఇనుము మొ॥గు బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారులకు నష్టములు తప్పవు. ఆయిల్స్, నెయ్యి, డైరీ ఫారమ్స్ వార్కి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గత సంవత్సరం కంటే బాగుంటుంది. రైసుమిల్లర్స్ కు మిశ్రమ  ఫలీతాలు, నష్టాలురావు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వార్కి బాగుంటుంది.

విద్యార్థులకు ఈ సంవత్సరంలో బాగుంటుంది. గురుబలంఉంది. కాని అష్టమశని ప్రభావం వల్ల చదువులందు శ్రద్ధ చూపలేరు.ఇతర వ్యాపకాలు హెచ్చును .పరీక్షలందు ఆశించిన మార్కులు పొందలేరు. ఇంజనీరింగ్, మేడికల్, ఈసెట్, ఆసెట్, ఐసెట్బి.ఇడి, లా, ఎంట్రన్స్ పరీక్షలందు మంచిర్యాంకులు పొందకపోయినా సీట్లను పొందగలరు. విదేశాలందు చదువు కొనేవార్కి బాగుంటుంది. క్రీడాకారులకు బాగుంటుంది.

వ్యవసాయదారులకు ఈ సంవత్సరంలో ఒకపంట మాత్రమే బాగుంటుంది. 2వ పంట దిగుబడి తగ్గును. లాభాలు రాకపోయినా నష్టాలురావు. కౌలుదార్లకు ఫర్వలేదనిపించును. ప్రభుత్వ సంబంధ సహాయాలు అందును. ఋణాలు తీర్చలేకపోయిన ఒత్తిడి ఉండదు. గృహంలో శుభకార్యాలు జరుగును. చేపలు,రొయ్యలచెరువులు చేయువార్కి మధ్యస్తంగా ఉంటుంది. ఫౌల్టీ రంగంలో ఉన్న వార్కి మంచి లాభములు వచ్చును

స్త్రీలకు:- ఈ సంవత్సరంలో అష్టమశని, వ్యయరాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలోవ్యతిరేకంగా ఉంటుంది. ఏ పని చేయబుద్ధికాదు. శస్త్రచికిత్సజరుగును.పితృ,మాతృ భర్త తరపువంశాలకు అరిష్టాలు. సూతకాలు. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. ఆచితూచిమాట్లాడ వలెను. దూరప్రాంతాలకు బదిలీలు, గర్భిణీస్త్రీకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ,స్త్రీ సంతాన ప్రాప్తి, వివాహం కాని స్త్రీలకు గురుబలం వల్లవివాహం జరుగును.మొత్తంమీద ఈరాశిస్త్రీ పురుషాదులకు మిశ్రమఫలితాలు. శనిప్రభావం వల్లచెడు ఫలితాలు అధికంగా ఉంటాయి. మీ తెలివి తేటలు అంతగా పనిచేయవు.

చేయవలసిన శాంతులు:-మంగళ, శనివారనియమాలుపాటించండి ఆరోజుల్లో మీగ్రామంలోగల శివాలయంలో అభిషేకాలుచేయండి. శ్రీశైలక్షేత్రంలో జాగరణ చేయండి. శని,రాహుగ్రహయంత్రాలు ధరించినమంచిది.


కర్కాటక


కర్కాటక రాశి (CANCER)

పునర్వసు 4 వ పాదము పుష్యమి 1,2,3,4 పాదములు ఆశ్రేష 1,2,3,4 పాదములు

ఆదాయం - 14     వ్యయం - 2         రాజపూజ్యం - 6   అవమానం - 6

ఈ రాశి స్త్రీపురుషాదులకు 6,9 భాగ్యాధిపతియైన గురువుకుంభంలో అష్టమందు, 7,8 అధిపతియైన శని సప్తమంలో., రాహు,కేతువులు, 11,5లలో బలీయంగా ఉండుట వలన ఈ సంవత్సరంలో చెప్పుకోతగ్గ విశేషములు, కొన్ని సంఘటనలు జరిగి సాంఘికముగా రాణించగలుగుతారు. గాని స్వశరీర, సంతానం, కుటుంబ రీత్యాను రక్తబంధు వర్గములోను శరీరరుగ్మతలు, ధనవ్యయ ప్రయాసలకు కారణమగును. నూతనఉద్యోగం లేక వ్యాపార ప్రయత్నాలు సాగిఫలించును. జాయింటు కుటుంబీకులు లేక వ్యాపారస్తులు వల్ల ప్రారంభంలో ఎంతో యోగించి లాభించినా ఆఖరులో దిగజారును. మీలో గల దుర్భలత వల్ల స్థైర్యాదులు లేకుండుట చేతను ముందుకు వెళ్ళలేరు. ఏ విషయంలో నైనా ధైర్యం చాలదు. ప్రతీ విషయంలో కష్టాలేఎదురగును. చేయు కృషి,వ్యవహారములలో నష్టద్రవ్యలాభము కలుగును. రాహువు వల్లసు దూరప్రయాణాలు ఆకస్మికంగా చేయవలసివచ్చును. కొన్ని విషయాలలో మనోనిబ్బరం కోల్పోవుదురు. నష్టాలు కలుగును. 8వ ఇంట గురు ప్రభావంచే విపరీతంగా నష్టములు అనుకోని దుస్సంఘటనలు జరుగును. పితృ వంశంవారితో అకారణవిరోధాలు, సూతకాలుతప్పవు. సంతానమునకు కూడా ఆరోగ్యభంగములు తప్పవు. గృహమార్పులు లేదా స్థానచలనములు తప్పకజరుగును. గృహనిర్మాణాది పనులు మధ్యలో నిలిచిపోవును. శుభకార్యములకు కూడా ఆటంకాలు ఏర్పడును.

ఉద్యోగులకు ఈ సంవత్సరం అంతఅనుకూలంగా ఉండదు. 8వ ఇంట గురు ప్రభావంచేత బదిలీలుతప్పవు. పనులందు శ్రద్ధచూపలేరు. అధికారుల ఇబ్బందు లుంటాయి , పనులు మధ్యలో నిలిచిపోవును. కేంద్రరాష్ట్ర, ప్రభుత్వములందు పనిచేయు ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. సుదూర ప్రాంతాలకు బదిలీలు అగును.నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశే ఎదురగును. పర్మినెంటు కానివార్కి ఈ సంవత్సరం పర్మినెంట్ అగును. ప్రవేటు సంస్థలలో పని చేయువారకి మరొక కంపెనీకి బదిలీ అగుదురు. కాంట్రాక్టుఉద్యోగులకు కొంచెంఫర్వాలేదు. కార్మిక వర్గం వార్కి బాగుంటుంది. విదేశములలో ఉద్యోగ ప్రయత్నములు చేయువార్కి కలిసివచ్చును.

రాజకీయనాయకులకు రాహువు,బలీయంగాఉన్నందునప్రజలలోపేరు ప్రఖ్యాకులు ఉంటాయి. అధిష్టానవర్గంలో మంచిపేరు ఉంటుంది. ఎన్నికలలో నిలబడిన ఆఖరి నిముషంలో విజయం సాధించెదరు. నామినేటడ్ పార్టీపదవులు వచ్చితీరును.ధనం విపరీతంగా ఖర్చు, శతృవులు కూడా సహాయ సహకారాలు అందించెదరు.

కళాకారులకు గురుబలం లేని కారణంగా ప్రయత్నాలు అంతగా ఫలించపు.విజయాలు ఉండవు. నూతన అవకాశాలు తక్కువ. టి.వి. సీనిమారంగములందున్న వార్కిఇబ్బందులు.గాయనీ,గాయకులు, రచయితలు, దర్శకులు, టెక్నిషియన్స్ కు మిశ్రమ ఫలితాలిచ్చును. రాహుబలం వల్ల ప్రవేటు సంస్థల ద్వారా అవార్డులు.

వ్యాపారస్థులకు ఈ సంవత్సరం అంతఅనుకూలత ఉండదు. 8వ ఇంట గురుని వలన అనుకున్నంత వ్యాపారం జరుగదు. హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉండును.వ్యాపార మార్పులు జరుగును. ఇనుము,స్టీలు, బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారం బాగుంటుంది. కాంట్రాక్టు దారులకు బాగుంటుంది. ఫైనాన్సు రంగంలో ఉన్న వార్కి నష్టాలు. సరుకులు నిల్వచేయు వారలకు కొంత ఫర్వాలేదనిపించును

విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం లేనందున చదువుపై శ్రద్ధఉండదు. ఇతర వ్యాపకాలు అధికంగాఉంటాయి. స్వల్పంగా ఆరోగ్యభంగాలు. ఇంజనీరింగ్,మెడికల్ ఈసెట్, ఆసెట్,పాలిటెక్నిక్, బి. ఇడీ, ఐసైట్, లాసేట్, మొ॥గు ఎంట్రన్సు పరీక్షలు వ్రాయు వార్కిసీట్లు పొందగలరు.విదేశీ ప్రయత్నాలు చేయు వార్కి ఫలించును.

వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రాహుబలం వల్ల రాణింపు ఉంటుంది. రెండు పంటల దిగుబడి బాగుంటుంది. మంచి లాభాలు చేకూరును. ఋణాలుతీర్చుదురు. కౌలుదార్లకు లాభించును.గృహంలో శుభకార్యాలు చేయుదురు. నర్సరీ,పండ్లతోటలు చేయు వారలకు కూరగాయలసాగు చేయువార్కి విశేషలాభాలు. చేపలు, రొయ్యలు చేయు వారలకు విశేషలాభములు. ఫౌల్ట్రీరంగంలో ఉన్నవార్కి లాభమే.

స్త్రీలకు:- ఈ సంవత్సరం ఈరాశివార్కి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాహుబలం వలన కొన్నివర్ణములవార్కి బాగుంటుంది. గురుబలం లేనందున మీ యొక్క ఆకర్షణ తగ్గును. కుటుంబంలో మీ యొక్క విలువ తగ్గును. భార్యాభర్తల మధ్య అవగాహన తగ్గును. కొన్ని విషయాలలో అభిప్రాయబేధాలు వచ్చును. ఆచితూచి వ్యవహరించవలేను. విలువైన వస్తువులు ప్రాప్తించును. ఉద్యోగాలు చేయువార్కి సుదూరప్రాంతములకు బదిలీలు జరుగును. వివాహం కాని వార్కి వివాహం జరుగును. గర్భిణీస్త్రీలకు ఆపరేషన్ తప్పదు. పుత్రసంతానప్రాప్తి, కుటుంబసౌఖ్యం. మొత్తం మీద ఈరాశి స్త్రీపురుషాదులకు రాహు,గురుబలంలేదు. శని మిశ్రమ ఫలదాయకుడు మీకు స్వతహాగా తెలివితేటలు ఉన్న సమయానికి కలిసిరావు.పనులందు, వృత్తి, వ్యాపారాలందు ఆంటకాలు. అగౌరవం పొందుట కలుగును.

చేయవలసిన శాంతులు :- గురు, శనివార నియమాలు పాటించండి. గురు, శనివారములలో మీ గ్రామంలో శివాలయం, రుద్రాభిషేకం చేయండి. శ్రీశైలక్షేత్రం దర్శించండి. అన్నదానం చేయండి. గురు, శని యంత్రాలు ధరించిన మంచిది.


సింహం


సింహరాశి (Leo)

మఘ 1,2,3,4 పాదములు పుబ్బ 1,2,3,4 పా ఉత్తర 1 పాదము

ఆదాయం - 2 వ్యయం - 14 రాజపూజ్యం - 2 అవమానం - 2

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన-కుటుంబ -గౌరవాదులు సంతానమునకుకారకుడైన గురుడు 7లో కుంభంలోనూ, షష్ఠ, సప్తమాది శని 6వ ఇంట ఉండుట వలన, రాహు, కేతువుల స్థితి బాగుండుటచే గ్రహముల ఆధిపత్య ప్రభావం బాగుండుటచే మీలో గల మనోభావములు ఫలోన్ముఖమునకు వచ్చును. పెద్దలు,హోదావ్యక్తులతో పరిచయం, సాంఘికంగా గొప్పహోదా. హుందా, పేరుప్రఖ్యాతలు,వాహన సుఖం పొందుట, అధికారము వహింపగల శక్తి సామర్థ్యాలు ఏర్పడును.మీరు పట్టిందల్లా బంగారమా? అనునట్లుండును. గృహం, కుటుంబంలో ఉన్నత స్థాయిని పెంపొందించుకొనుట జరుగును. పాతగృహం లేక స్థలంకొని స్థిరాస్థిని వృద్ధిచేయుట జీవనలాభం కలుగును. ఆకస్మికధనలాభాలుకలుగును. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. తీర్థయాత్రాఫలప్రాప్తి, గుప్త, శతృబాధలు అంతరించుట కలుగును. ప్రభుత్వ సంబంధవ్యవహారములు పూర్తి అగును.నూతన కార్యములకు శ్రీకారం చుట్టెదరు. ఆర్ధికంగా బలపడుదురు. మీ యొక్క ధైర్య సాహసములు వలన బాగా లబ్దీని పొందగలరు. మీకు వ్యతిరేకంగా ముందుఉన్నను, చివరకు మీకు ఉపకారముగా పరిణమించును. కళత్రం రీత్యా సంతానం రీత్యాఆనందం. అత్యధికప్రాముఖ్యత, శుభకార్యాలు. నూతన ఆలోచనలతో ముందుకువెళ్ళుదురు. ఇతరులకు సహాయసహకారాలు అందిస్తారు. ఏ విషయంలోనూ అధైర్యం చెందక ధైర్యంతో వ్యవహరిస్తారు. శతృవులుగా ఉన్నవారు మిత్రులగుదరు.

ఉద్యోగులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. పనులందు శ్రద్ధ వహిస్తారు.అధికారుల మన్ననలు పొందుదురు. ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు జరుగును.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలలో పనిచేయువారలకు మహోన్నతకాలం. ఇంక్రిమెంట్ వచ్చును.గృహనిర్మాణం  లేదా స్థలంకోనుట ,నూతనవాహనం కొంటారు.విలువైన వస్తువులు లభ్యమగును. నిరుద్యోగులు ఈ సంవత్సరం జీవితంలో స్థిరపడుదు. పర్మినెంటుకానివార్కి ఈ సంవత్సరం తప్పక పర్మినెంటు అగును. ప్రవేటు సంస్థల పనిచేయువారలకు యజమానుల మన్ననలు పొంది జీతభత్యములు పెరుగును .

రాజకీయ నాయకులకు ఈ మంచిపేరు ప్రఖ్యాతులు మంచినాయకునిగాగుర్తింపుఉంటుంది. అధిషానవర్గంలో అనుకూలంగా ఉండును. ప్రజలలో మంచిపేరు ప్రఖ్యాతులు మంచి నాయకునిగా గుర్తింపు ఉంటుంది. అధిషానవర్గంలో కూడా మంచిపేరుఉంటుంది. అధికారం, పదవులు తప్పకలభించును. కనీసం పార్టీకి సంబంధించిన నామినేటడ్ పదవైనాలభించును. ఎన్నికలలోమీదేవిజయం.

 

కళాకారులకు ఈ సంవత్సరం గురుబలంబాగుంది. విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి .టి.వి. సినిమారంగంలో ఉన్న, గాయనీ,గాయకులు, రచయితలు, దర్శకులు,టెక్నీషియన్స్ కు విజయాలులభించి,నూతనఅవకాశాలుపెరుగును. ఆర్ధికంగా బలపడుదూరు. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల అవార్డులు, రివార్డులు లభించును

వ్యాపారస్థులకు ఈ సంవత్సరం కూడా బాగుంటుంది. మంచి వ్యాపారాలు జరుగును అన్నిరంగములవార్కి యోగించును. హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్న అందరికీఅనుకూలమే. బంగారం, వెండి వ్యాపారులకు బాగుంటుంది. ఇనుము, ఇటుక, సిమ్మెంటు బిల్డింగ్ మెటీరియల్స్ వార్కి మధ్యస్థము, రైసుమిల్లర్స్కు బాగుంటుంది.రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వార్కి బాగుంటుంది. ప్రభుత్వం, ఫైనాన్సురంగంలో ఉన్న వార్కి అనుకూలమే. చిన్న చిన్న ఫ్యాక్టరీలు నడుపువార్కి చాలా బాగుంటుంది.

విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. జ్ఞాపకశక్తి పెరుగును. మంచి మార్కులతో ఉత్తీర్ణుగుదురు. ఇంజనీరింగ్, మెడికల్,ఐసేట్, ఈసెట్,ఆసెట్,లాసెట్,పాలిటేక్నిక్, బి. ఇడి.మొదలగు ఎంట్రన్స్ పరీక్షలయందు మంచి మార్కులతో కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు విజయాలు లభించును.

వ్యవస్తాయదారులకు రెండు పంటలు మంచి దిగుబడి వచ్చును. అధికలాభాలు.ఋణాలు తీరుస్తారు. కౌలుదార్లకు బాగుంటుంది. ప్రభుత్వ సంబంధ సహాయం లభించును. నర్సరీలు, పూలు,పండ్లతోటలు వార్కి బాగుండును. చేపలు, రొయ్యల చెరువుల వార్కి అనుకూలసమయం. పౌల్ట్రీరంగంలో ఉన్న వార్కి మంచి లాభాలు.

స్త్రీలకు :- ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా ? అనునట్లుండును. మీ మాటకు ఎదురుండదు. కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. బంధువర్గంలోనూ మీ విలువ పెరుగును. సలహాలు, సంప్రదింపులు చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. మీపేరుతో ఆస్తులుకొంటారు. వాహనసౌఖ్యం, ఉద్యోగాలు చేయువార్కి ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు పొందగలరు. కష్టమునకు తగ్గ ఫలితం పొందగలరు. గర్భిణీస్త్రీలకు ఫ్రీడెలివర్ పుత్ర సంతాన ప్రాప్తి. వివాహం కానీ స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరిగితీరును. మొత్తం మీద మహోన్నతంగా ఉంటుంది. మొత్తం మీద ఈరాశి స్త్రీపురుషాదులకు గ్రహాల అనుకూల సంచారంవల్ల అన్నివిధాలుగా బాగుంటుంది. మీ యొక్క తెలివి తేటలు సత్ప్రవర్తనకు తోడు గ్రహబలం తోడగుటచే మీకు ఎదురుండదు. ఎంతటికార్యాన్నైనా అవలీలగా సాధించగలరు.

చేయవలసిన శాంతులు:- మీకు నరఘోష అధికంగా ఉండుట వలన మంగళవార నియమాలు పాటించండి. మంగళవారం మీగ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయిండి. శ్రీశైలక్షేత్రం దర్శించండి. నరఘోష, నవగ్రహ శాంతి యంత్రాలు ధరించిన మంచిది


కన్య


 

కన్యరాశి (VIRGO)

ఉత్తర 2,3,4 పాదములు హస్త 1,2,3,4 పాదములు చిత్ర 1,2 పాదములు

ఆదాయం – 5    వ్యయం –5       రాజపూజ్యం – 5            అవమానం - 2

ఈ రాశి స్త్రీ, పురుషాదులకు వాహన సప్తమాధిపతియైన గురువు కుంభంలో 6వ ఇంట, శని పంచమందు, రాహువు కేతువు, 9,3 స్థానాలలో, ఉండుట వల్ల ఏ విషయంలోనైనా మీ రాజకీయం బాగా పనిచేయును. మీ మాటపై ఇతరులు నడుచునట్లు చేయుదురు. పట్టుదల ఎక్కువ, కార్యసాధకులు, మీలోగల శక్తి, యుక్తి, చాతుర్యాలతో స్త్రీ పురుషాదులను వశం చేసుకొని పై అధికారులను కూడా ఒక ఆట ఆడించెదరు. అంతట సామర్థ్యం పెరుగును. మీ ఆడవారు చెప్పినట్లు మసలుకొనేది. వాగ్వాదాలు పెట్టుకొనవలదు. భార్యను ప్రేమించేది. ఆమె ప్రభావం వల్లనే మీకు యోగబలం హెచ్చును. ఆదాయం ఎంతవచ్చిన ఖర్చులు కూడా అధికంగాచేయుదురు. ఒక్కోసారిఋణాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. శారీరకశ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది. నూతన గృహలాభం, కనీసం స్థలం అయినా కొంటారు. పాతవాహనం తీసేసి నూతన వాహనం కొంటారు. ఒక్కోసారి రాత్రులందు కలవరం. నిరుత్సాహంగా ఉంటుంది. భార్యను, పిల్లలను సంతోషపరచ లేకున్నానని లోలోపలదిగులు చెందుట, రాహువు, ప్రభావంచే తీర్ధయాత్రలు పుణ్య నదీస్నానాలు, అన్నివిధాలా బాగుండుటచే మీలో ఒకింత అహంకారం పెరుగును.

ఉద్యోగులకు ఈ సంవత్సరం బాగుంటుంది. అధికారులు కూడా మీ సలహాలుతీసుకుంటారు. మీ మాటకు విలువ పెరుగును. గౌరవమర్యాదలుపెరుగును. ప్రమోషతో కూడిన బదిలీలు. ధనము నిల్వచేయుదురు. గృహనిర్మాణములు కలిసి వచ్చును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందున్న వార్కి యోగకాలమే. ఇంక్రిమెంట్లు పెరుగును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం జీవితంలో స్థిరత్వం పొందగలరు. పర్మినెంటు కాని వార్కి ఈ సంవత్సరం పర్మినెంట్ అగును. ప్రవేటు సంస్థలలో పనిచేయువారలకు యజమానుల మన్ననలను పొంది జీతములు పెరుగును. కార్మికవర్గంవారు మరొక ఫ్యాక్టరీలకు మారుదురు.  విదేశాలలో ఉద్యోగ ప్రయత్నములు చేయువార్కి ప్రయత్నములు ఫలించును. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతభత్యములు పెరుగును

రాజకీయనాయకులకు ఈ సంవత్సరం బాగుటుంది. ప్రజలలో పేరు ప్రఖ్యాతులు పెరుగును. ప్రజలకు పనులు చేయుదురు. అధిష్టాన వర్గంలో కూడా మీకు మంచి గుర్తింపు ఉంటుంది.పదవులు లభించును.కనీసం పార్టీలోగాని నామినేటెడ్ పదవులైన లభించును.ఎన్నికలలో పోటీచేసినట్లైన విజయం.ధనం మాత్రం విపరీతంగా ఖర్చు.

కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది మంచి గుర్తింపు ఉంటుంది .ప్రయత్నాలు ఫలించును.టి.వి. సినిమారంగంలో ఉన్న గాయనీ,గాయకుల రచయుతలు,దర్శకులు,టెక్నీషియన్స్ కు విజయాలు లభించి నూతన అవకాశాలు అధికం .

 

 

జీవితంలో స్థిరత్వం.ఆదాయఅభివృద్ది.గృహలాభాలు.ప్రభుత్వ సంబంధ అవార్డులు,

ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్థులకు బాగుంటుంది. అనుకున్న వ్యాపారాలు జరుగును. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. హోల్ సేల్ మరియు రిటైల్ రంగంవార్కి బాగా కలిసివచ్చును.జాయింటు వ్యాపారాలు చేయువార్కి భాగస్వాములతో సరైన అవగాహన ఉంటుంది. మెడికల్ వ్యాపారులకు చాలా బాగుంటుంది. బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారులకు కొంత తగ్గును. బంగారం, వెండి వ్యాపారులకు అధిక లాభం, షేర్ మార్కెట్లో ఉన్న వార్కి అనుకూలమే. రియల్ ఎస్టేట్ వార్కి లాభించును.

విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. జ్ఞాపకశక్తి పెరుగును. చదువుపై శ్రద్ధ ఉంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. ఇంజనీరింగ్, మెడికల్, ఐసెట్, ఈసెట్, ఆసెట్ లాసెట్,బి.ఇడి. మొదలగు ఎంట్రన్సుపరీక్షలులో మంచి ర్యాంకులు సాధించి, కాలేజీలలో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు విజయాలు లభించును.

వ్యవసాయదారులకు రెండు పంటలుమంచి దిగుబడి వచ్చి లాభాలుచేకూరును.ఋణాలు తీరుస్తారు. కౌలుదార్లకు చాలా బాగుంటుంది. గృహంలో శుభకార్యాలు జరుగును. నర్సరీ,పూలు, పండ్లతోటల వార్కి లాభించును. చేపలు, రొయ్యల చేరువులవార్కి మధ్యమఫలితాలు, డైయిరీ ఫారమ్స్ వార్కి పౌల్ట్రీరంగంవార్కి అనుకూలం.

స్త్రీలకు: ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. మీమాటకు తిరుగుండదు.కుటుంబంలో, బంధుమిత్రాదులలో మీపై ప్రత్యేకంగా గౌరవం, అందరూ మీమాట వింటారు. ప్రతివిషయంలో మీదే పైచేయి. మీ పేరులో విలువైన వస్తువులు , స్థిరాస్తులు సమకూరును. భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటుంది. సుఖవంతమైన జీవనం. ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు. వివాహంకాని వార్కి ఈ సంవత్సరం వివాహం జరిగితీరును.గర్భిణీ స్త్రీలకు ఫ్రీడెలివరీ, స్త్రీ సంతానప్రాప్తి, విలాసవంతమైన జీవనం గడుపుదురు. మొత్తంమీద ఈ రాశి స్త్రీపురుషాదులకు మీ ధైర్య సాహసాలకుతోడు గ్రహబలం తోడుఅగుటచే మంచి యోగదాయకంకాలం అన్నింటా విజయమే. ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తారు. అన్ని విధాలుగా బాగుండటచే మీ పై ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇతరులకు అధికంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి.

చేయవలసిన శాంతులు:- నరఘోష అధికంగా ఉండుటవల్ల మంగళవారం మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయించాలి .శ్రీశైలక్షేత్రంలో జాగరణ చేయండి.నరఘోష, నవగ్రహశాంతి యంత్రాలు ధరించిన మంచిది.

 


తుల


 

తులారాశి(libra)

చిత్ర 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు విశాఖ 1,2,3 పాదములు

ఆదాయం-2        వ్యయం-8           రాజపూజ్యం-1     అవమానం-5

ఈ రాశిస్త్రీ, పురుషాదులకు, కుటుంబం, సంపత్తు,విద్యకు కారకుడైన గురువు కుంభంలో 5వఇంట, శనిచతుర్దంలో రాహు, కేతువులు, 8, 2వ ఇంట ఉందులు చేతను, గురుబలం ఉన్ననూ, 4వ ఇంట శని, రాహువు వల్ల మిశ్రమ ఫలితాలు ఇచ్చును. మీ యొక్క మనోవాంచలు సిద్ధించుట కష్టమే అగును. అనుకున్నది ఒక్కటి జరిగేది మరొక్కటిలా ఉంటుంది. స్వశక్తి సామర్ధ్యములచే కొంతమేర పైకి రాగలరు.సంఘంలో గౌరవాలు తగ్గును.స్థానాచలనాలు,గృహాచలనాలు తప్పవు. మానసికంగా ఇబ్బందులు ఏర్పడును. ప్రయాణములందు ఇబ్బందులు వాహన ప్రమాదాలు జరుగును. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలలో చిక్కులు ఋణములు చేయవలసి ఉంటుంది. ఎంత ఓపికగా ఉన్నా ఏదో ఒక సమస్యలో ఇరుక్కొంటారు. బంధుమిత్రులు బాగా కలిసి వస్తారు. మీకు ధైర్యం చెప్పి సహాయసహకారములు అందిస్తారు. ఆర్ధికంగా నిలబడినా ఆకస్మిక ధనవ్యయం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ భార్యయోగం వల్ల మీకు కొంత రక్షణ కలుగును.ఆమె మాటప్రకారం నడుచుకొనుట మంచిది. సంతానంకు భార్యకు కూడా స్వల్పంగా ఆరోగ్యభంగాలు కలుగును. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రా ఫలప్రాప్తి, పుణ్యనదీస్నానం చేయుదురు. సంతానంవల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడును .ఇతరులకు, హామీలు జామీనులు ఉండుట మంచిది కాదు. నష్టపరుచును. మీకు ఎలాంటి తెలివి తేటలు ఉన్నా శని ప్రభావం వలన పనిచేయకుండా పోవును.

ఉద్యోగులకు ఈ సంవత్సరం ఫర్వాలేదనిపించును. అష్టమ రాహువు ప్రభావం చూపించును. సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగును. గురు,శనుల ప్రభావంచే ప్రమోషన్ తో కూడినబదిలీలు .కుటుంబంకు దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలందు పనిచేయువారలకు ఇబ్బందికరం.అధికార వేధింపులు.నిరుద్యోగులకు ఉద్యోగం లభించినా సంతృప్తిగా ఉండదు. పర్మినెంట్ కాని వార్కి ఈ సంవత్సరం కూడా నిరాశే ఎదురగును. జీవితం కాలక్షేపం చేయ వలసివచ్చును.

రాజకీయనాయకులకు ఈ సంవత్సరం బాగుంటుది. గురు,శనులబలం బాగుంది.. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు అధిష్ఠాన వర్గంలోనూ మంచి పేరు ఉంటుంది. అష్టమ  రాహువువల్ల శతృవర్గం వల్ల కొన్ని దుస్సంఘటనలు. మీ పేరును దెబ్బకొట్టే ప్రయత్నాలు. కనీసంపార్టీ పరపతిగాని, నామినేటడ్ పదవిగాని తప్పక లభించును.

కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. టి.వి. సినిమారంగంలో ఉన్న గాయనీగాయకులు, దర్శకులు, రచయితలు, టెక్నీషియన్స్ విజయములు లభించి నూతన అవకాశాలు. తరుచుగా ప్రయాణాలు చేయుదురు. ఆదాయం బాగుంటుంది. ప్రవేటు ప్రభుత్వ సంస్థల ద్వారా అవార్డులు, రివార్డులు వచ్చును.

వ్యాపారస్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్ని వర్గాల వార్కి లాభించును. కొందరికి నష్టం వాటిల్లును. ఇనుము, ఇసుక, బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారులకు లాభించును. కిరాణా,హోటల్స్, కూరగాయల వ్యాపారులకు విశేషంగా లాభించును. కాంట్రాక్టుదారులకు నష్టాలే. కొత్తపనులు రాక ఇబ్బందులు . ఫైనాన్సు రంగంలో ఉన్నవార్కి బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవార్కి మిశ్రమ ఫలితాలు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభించును. సరుకునిల్వచేయువార్లకు లాభం.

విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. చదువుపై శ్రద్ధ ఉంటుంది.జ్ఞాపకశక్తి పెరుగును. అష్టమ రాహువుచే స్వల్పంగా అల్లర చిల్లరగా తిరుగుదురు.అయినా మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. ఇంజనీరింగ్ మెడికల్, ఆ సైట్, ఐసెట్, ఈసెట్, పాలిటెక్నిక్, లాసెట్, బి.యిడి. మొదలగు ఎంట్రన్సు పరీక్షలయందు మంచి ర్యాంకులు సాధించి కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు.

వ్యవసాయదారులకు రెండు పంటలు బాగున్నా దిగుబడి కొంత తగ్గుటచే ఆదాయం తగ్గును. ఆశించిన ఫలితాలు పొందలేరు. ఋణాలు తీర్చలేరు. కౌలుదార్లకు ఇబ్బందికర పరిస్థితులుంటాయి. చేపలు, రొయ్యల చెరువులు చేయువార్కి బాగుంటుంది. ఆశించినంత లాభాలు రావు. డైయిరీ ఫార్మ్, వార్కి లాభించును.

స్త్రీలకు: ఈ సంవత్సరం గురు, శనుల బలంబాగుంది. మీఆకర్షణ తగ్గదు. కుటుంబంలో అందరూ మీ మాటకు విలువనిస్తారు. ప్రతీపని యోచించి నిర్ణయింతీసుకొనుటచే విజయవంతమగును. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. విలువైన వస్తువులుకొంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన తగ్గును. సుదూర ప్రాంతాలకు బదిలీలు. వివాహంకాని వార్కి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగును. గర్భిణీ స్త్రీలకు శస్త్ర చికిత్స తప్పదు. పుత్ర సంతాన ప్రాప్తి, గతంలో విడిగా ఉన్నవారు ఈ సంవత్సరం కలువలేరు. భర్త తండ్రి, తల్లి వర్గ సూతకాలు కల్గును.మొత్తం మీద ఈ రాశిస్త్రీ పురుషాదులకు మిశ్రమం. 8వ ఇంట రాహు ప్రభావం అధికంగా ఉంటుంది. తరుచుగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. గురు,శనుల బలం కారణంగాను, దైవబలం ఉండుటవల్ల కొన్ని పనులు పూర్తి చేయగలరు.

చేయవలసిన శాంతులు - రాహు స్థితి బాగాలేనందున మంగళవారం మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయండి. శ్రీశైలక్షేత్రంలో జాగరణ చేయండి. రాహు,కేతుయంత్రాలు ధరించిన మంచిది.


వృశ్చికం


వృశికరాశి(scorpio)

విశాఖ 4 పాదము అనూరాధ 1,2,3,4 పాదములు జ్యేష్ఠ 1,2,3,4 పాదములు

ఆదాయం – 8       వ్యయం – 14       రాజపూజ్యం – 4                  అవమానం - 5

ఈ రాశిస్త్రీ పురుషాదులకు యోగకారుడుకైన గురువు కుంభంలో 4 ఇంట శని తృతీయంలో ఉండుట వలన తమ ప్రజ్ఞా విశేషాలు కనపరచి ఇతురుల కంటే లాభాలు పొందుదురు. ఏపనిచేయుటలో నైనా పట్టుదలతో ఉంటారు. ఎలాంటి శత్రువునైనా లొంగదీసుకుంటారు. పాతగృహంకొనుటలేదా మరమ్మత్తులు చేయుట,ఖాళీస్థలం కొనుట జరుగును. తమ మాట నిలబెట్టుకొనుటకు ఎంతటి సాహసమైనా కనపరచి విజయం సాధిస్తారు.వచ్చిన అవమానాలను లెక్కచేయరు. కామోద్రేకాలు హెచ్చి, వ్యసనాలకు అప్రయత్నముగా లొంగిపోవుదురు.స్త్రీల యందు మోజుపడి కలయికచే కార్యసాధకులగుదురు. పనులందు శ్రద్ధచూపుతారు. మీలో గల నేర్పు నలుగురికి తెలిసి ఇంకనూ అనేక మంచి పనులు చేస్తారు.విదేశప్రయాణాలు కలిసీ వచ్చును. దూరప్రయాణాలు చేయుట పుణ్యక్షేత్ర సందర్శనాలు, వినోదాలచే మానసిక ఆనందమును పొందుదురు. జన్మ, కేతు, సప్తమ రాహువువల్ల ఆరోగ్యభంగములు స్వల్పంగాకలుగును. కళత్ర మాత్తృ, పితృవంశసూతకాలు అరిష్టములు కలుగును ఏల్నాటి  శని పూర్తిగా తొలగుటచే జీవనం గొప్పగా ముందుకు సాగును. కుటుంబ కలతలు వచ్చినా మీదే పైచేయిఅగును. ఇతరులు మీ సలహాతీసుకొని లబ్దిపొందుదురు.పాపపు పనులుచేసినా సమర్ధించుకొంటారు. తక్కువవారివల్ల మాటలు పడుట జరుగును. కొన్ని విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీకు ఎవరైనా అపకారం తలపేట్టినా వారికే నష్టము కలుగును. ధనాదాయం బాగుండును.

ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగుంటుంది. గురు,శనుల ప్రభావంవల్ల రాహు, కేతువుల ప్రభావంతగ్గును. తరుచుగా ప్రయాణాలు చేయవలసిచ్చును. స్థాన చలనాలు,గృహ మార్పులు తప్పవు. అధికారులు మిమ్మల్నిమెచ్చుకుంటారు. మీ యొక్క సలహాలు తీసుకుంటారు.గృహనిర్మాణములు కలిసి వచ్చును. నూతన వాహనం కొంటారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పవు. ఇంక్రిమెంట్లు పెరుగును.ప్రవేటు సంస్థలలో పనిచేయువారలకు ఎక్కువ జీతంతో మరొక కంపెనీకి మారుదురు.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ప్రజలలో పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. కార్యక్రమాలు అధికంగా చేయుదురు. అధిష్టానవర్గం కూడా మీ పై సదాభిప్రాయం కలిగి ఉంటారు. రాహు ప్రభావం వలన కావలసిన వారే మీ పేరును పాడుచేయుటకు ప్రయత్నిస్తారు. ఆచితూచి వ్యవహరించాలి.

కళాకారులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుంటాయి. విజయాలు తగ్గును. టి.వి. సినిమారంగంలో ఉన్న గాయనీగాయకులు, దర్శకులు, రచయితలు, టెక్నీషియన్స్ విజయాలు తగ్గినా నూతన అవకాశములు అధికంగా వచ్చును ధనలాభం, గృహనిర్మాణం చేయుదురు. ప్రవేటు, ప్రభుత్వ సంస్థల అవార్డులు.

వ్యాపారస్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అన్నిరంగము వార్కి మంచి వ్యాపారములు జరుగును. కిరాణా, కూరగాయలు, వ్యాపారాదులకు కూడా లాభములు వచ్చును. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు బాగుంటుంది సరుకులు నిల్వచేయు వారలకు ధరలు పెరిగి లాభాలు వచ్చును. రియల్ ఎస్టేట్ వార్లకు గత సంవత్సరం కంటే బాగుంటుంది. ప్రభుత్వం, ప్రవేటు కాంట్రాక్టర్సుకు బిల్లు సమయానికి వచ్చును. నూతన కాంట్రాక్టు లభించును. రైసుమిల్లర్స కు విశేషంగాలాభం.

విద్యార్థులకు ఈ సంవత్సరం గ్రహబలం బాగుంది. ఏల్నాటిశని ప్రభావం పూర్తిగా తొలగినది. చదువుపై శ్రద్ధ ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగును. రాహు ప్రభావంచే కొంత మందగించును. పరీక్షలందు ఉత్తీర్ణులగుదురు. అనుకున్న మార్కులు లభించవు. ఇంజనీరింగ్, మెడికల్, ఆసెట్, ఐ సెట్, ఈసెట్, పాలిటెక్నీక్, లాసెట్. బి. ఇడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు ర్యాంకులు వచ్చి సీట్లను పొందగలరు.

వ్యవసాదారులకు రెండు పంటలు విశేషంగా పండును. ధరలు బాగుండుటచే లాభములు చేకూరును. ఋణములు తీరుస్తారు. కౌలుదార్లకు బాగుంటుంది. నర్సరీ, పండ్ల తోటలువార్కి విశేషలాభములు. చేపలు, రొయ్యల చెర్వులు చేయువార్కి బాగుంటుంది. డైయిరీలు నడుపు వార్కి పాల ధరలు పెరుగును.

స్త్రీలకు:- ఈ సంవత్సరం మంచి యోగమును అనుభవిస్తారు. గ్రహబలం బాగుంది. గృహంబులో శుభకార్యములు చేస్తారు. మీ పేరుతో స్థిరాస్తులు, వాహనలాభం .ఉద్యోగం చేయువార్కి అధికారుల అనుగ్రహం పనికి తగిన గుర్తింపు ఉంటుంది. ప్రమోషన్తో కూడిన బదిలీలు. భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది. 7వ యింట రాహువు వలన భర్త, తండ్రి, తల్లి తరఫున సూతకాలు కలుగును. వివాహంకాని వార్కి ఈ సంవత్సరం వివాహం జరుగును. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగును. గతంలో విడిపోయిన వారు ఈ సంవత్సరం కూడా కలవడం కష్టమే. మొత్తం మీద ఈరాశి స్త్రీపురుషాదులకు ఏల్నాటి శనిప్రభావం పూర్తిగా తొలగినది, గత అనేక సంవత్సరములుగా పడుచున్న బాధలు పటాపంచలైపోవును

చేయవలసిన శాంతులు:- ఈర్ష్య, అసూయ,నరఘోషవంటివి మీపైఉండును, గాన మంగళవార నియమాలు పాటించండి. మంగళవారం మీ గ్రామంలో గల శివాలయంలో అభిషేకం చేయండి. శ్రీ శైలంలో జాగరణ మంచిది. నరఘోష రాహు, గ్రహ యంత్రాలు ధరించిన మంచిది.


ధనస్సు


ధనస్సురాశి (SAGITTARIUS)

మూల 1,2,3,4 పాదములు పూర్వాషాఢ 1,2,3,4, పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము

ఆదాయం -11       వ్యయం – 5       రాజపూజ్యం – 7   అవమానం - 5

ధనకారకుడు, లగ్నవాహనాధిపతియైన గురువు 3వ ఇంట కుంభంలో ఉండుట, శని 2వ ఇంట, ఏల్పాటి శని, గాన ఈ రాశి స్త్రీపురుషాదులకు గత సంవత్సరం కంటే బాగుంటుంది. ధనయోగాలు అధికంగా కలవు. స్వశక్తి, సామర్థ్యము చేతను పైకి రాగలుగుట. గృహ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేయుదురు. స్థిరాస్తిలో మార్పులు. గృహచలనం, స్థానచలనము తప్పక కలుగును. కళత్ర సంతానమునకు స్వల్పంగా ఆరోగ్యపీడలు, గృహంబుల్డో వివాహాది శుభకార్యాలు కలిసివచ్చును. ప్రజాదరణ బాగుంటుంది. కుటుంబంలోను పైనఅనుకోని సంఘటనలు సిద్దించును. గుప్త, శతృబాధలు అంతరించును. ఆదాయం కలిసివచ్చును. నూతన పరిచయాలచే జీవితాభివృద్ధి కలుగును. శతృవులు మిత్రులగుదురు. ఏల్నాటి శని ప్రభావం కొంతమేర తగ్గును. బాధపడనవసరం లేదు. అనవసర ప్రేలాపనచేయుదురు. అప్రయత్న ధనలాభం కలుగును. గతంలో నిలిచిపోయిన కార్యాలు పూర్తిచేయగలరు. ఆడవారు తోడులేనిదే మీరు ఎందులోనూ పాల్గొనవలదు. వారి సలహాలే మీకు బలం. ఈమె విలువను దిగజారకుండా చూసుకొనుటమంచిది. స్థానచలనములున్నా మీ మంచికే జరుగును. ఎవ్వరితోనూ ఏవిషయంలోనూ, మితిమీరో ప్రసంగించ రాదు. స్థిరాస్థివృద్ధి చేయుదురు. గత్తంలో చేసిన బుణాలను తీర్చుదురు. నరాలసంబంద. ధాతుబిలం లేనందున ఔషధ సేవలు చేయడం జరుగును. 12వ ఇంట. కేతువు వల్ల తీర్థయాత్రలు,పుణ్యక్షేత్ర సందర్శనాలు,కుటుంబంలో చికాకులు కలిగించును.

ఈ సంవత్సరం ఉద్యోగులకు మిత్రమంగా ఉంటుంది. ఏల్నాటిశని ప్రభావం కొంత మేరతగ్గును. గురు,రాహువులబలంబాగుంది. కుటుంబమునకు దగ్గరగా ఉంటారు కోరుకున్న ప్రదేశములకు బదిలీలు జరుగును. కెంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వచ్చును. నూతన వాహనం కొంటారు. గృహ నిర్మాణము కలిసి వచ్చును.నిరుద్యోగులకు ఈ సంవత్సరం జీవితంలో స్థిరత్వం పొందుదురు. దూరంగా ఉద్యోగములు లభించును. పర్మినెంటు కాని వార్కి ఈ సంవత్సరం పర్మినెంటు అగును.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం మీకుబాగుంది. ప్రజలలోపేరు ప్రతిష్ఠలు మంచి గుర్తింపు ఉంటుంది. అధిష్ఠానవర్గం వారుకూడా మిమ్మల్ని గుర్తించెందరు. హోదా కలిగిన పదవి లభించును. పార్టీ లేదా ఏదైనా నామినేటడ్ పదవి లభించును. ఎన్నికలలో పోటీచేసినట్లుయితే విజయం.

కళాకారులకు గురుబలం బాగుంది. విజయాలు లభించును. టి.వి. సినిమా రంగంలో ఉన్న నటి నటులకు, గాయనీ, గాయకులకు, రచయితలు దర్శకులు, టెక్నిషియన్స కు చాలాబాగుంటుంది. మంచి విజయాలు అందుకుంటారు. నూతన అవకాశాలువచ్చును. ప్రభుత్వ, ప్రవేటు సంస్థలు అవార్డులు, రివార్డులు లభించును.

 

వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. మంచి వ్యాపారాలు జరుగును. అన్ని రంగాలవార్కి బాగుంటుంది. ఏల్నాటి శని వల్ల ప్రభుత్వదాడులు. ఐ.టి.దాడులు జరుగును. అయినా ఇబ్బంది ఉండదు. హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు మంచిలాభాలు. జాయింటు వ్యాపారులకు అనుకూలమే. ఇనుము మొదలగు బిల్డింగ్మెటీరియల్స్ వ్యాపారులకు అంత అనుకూలత ఉండదు. రియల్ఎస్టేట్ వ్యాపారులకు బాగుంటుంది. సరుకులు నిల్వచేయువారలకు విశేషలాభం, ఫైనాన్సు రంగంలో ఉన్నవార్కి మిశ్రమ ఫలితాలు, షేర్ మార్కెట్లో ఉన్న వార్కి లాభించును.

విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంది. గురుబలం వల్ల మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. చదువుపై శ్రద్ధ ఉంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. అందరూ మెచ్చుకుంటారు. ఇంజనీరింగ్ మెడికల్ ఈసెట్, ఐసెట్, ఆసెట్, బి. ఇడి, లాసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్సు పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులతో కోరుకున్న చోట్ల సీట్లను పొందగలరు. క్రీడాకారులకు బాగుంటుంది.

వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. గత సంవత్సరం కంటే మంచి దిగుబడి పొంది లాభాలు పొందగలరు. ఋణాలు తీర్చుదురు. గృహంలో శుభ కార్యములు చేయుదురు. కౌలుదార్లకు అనుకూలమే. ప్రభుత్వ సహాయం లభించును. చేపలు, రొయ్యల చెరువుల చేయువార్కి మిశ్రమ ఫలితాలుంటాయి.

స్త్రీలకు:- ఈ సంవత్సరం ఏల్నాటి శని ప్రభావం కొద్దిగా తగ్గును. గత సంవత్సరం కంటే బాగుంటుంది. గృహంలో శుభకార్యములు కలిసివచ్చును. మీ పేరుతో స్థిరాస్తులు, వాహనములను కొంటారు. ఉద్యోగం చేయువార్కి దూరప్రాంతాలకు బదిలీలు. భార్యాభర్తల మధ్య అవగాహన బ్యాగుంటుంది. గతంలో విడిగా ఉన్నవారు ఈ సంవత్సరం కూడా కలువలేరు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. పుత్ర సంతానం ప్రాప్తి, ఆధ్యాత్మికచింతన అధికంగా ఉంటుంది. దైవదర్శనాలు చేయుదురు. మొత్తంమీద ఈరాశి స్త్రీపురుషాదులకు బాగుంటుంది. ఏల్నాటి శని ప్రభావం తగ్గును. గురుబలం బాగుంది. మీ ఆలోచనలు సత్ఫలితాలు ఇచ్చును. గ్రహబలం బాగుండుటచే దైవబలం లాభించును.ఎంతటి కార్యాన్నేనా అవలీలగా సాధించగలరు.

చేయవలసిన శాంతులు:- నరఘోష అధికంగా ఉండుటచే మంగళవారం మీ గ్రామంలో గల శివాలయంలో అభిషేకం చేయండి. శ్రీ శైలక్షేత్రం దర్శించండి. నరఘోష, శని, కేతు యంత్రాలు ధరించిన మంచిది.


మకరం


మకరరాశి (CAPRI CORN)

ఉత్తరాషాఢ 2,3,4, పాదములు శ్రవణం 1,2,3,4 పాదములు ధనిష్ట 1,2 పాదములు

దాయం – 14     వ్యయం - 14      రాజపూజ్యం - 3   అవమానం - 1

ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు ధనస్థానము కుంభంలోనూ, జన్మంలో శని, ఏల్నాటి శని, 5, 11లలో రాహు, కేతువులు, మొత్తంమీద యోచించగా, ఆదాయంనకు లోటుండదు. కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు. ధన విషయంలో గతంలోకంటే బాగుండును. ఎంతటి సాహసం ప్రదర్శించినా పనులు పూర్తిగావు, జన్మంలో శనిపైకి బలంగా కనిపించినా ప్రతీచిన్నవిషయానికి లోలోపల దయాందోళనలు కలిగించును. ఒక్కోసమయాన ఏ పనిచేయ బుద్దికాదు. ఎంతటి చిన్న కార్యమైనా చాలా ఆలస్యంగా పూర్తిఅగును. ఒక్కగంటలో అయ్యేపని కొన్ని రోజులకు పూర్తిచేస్తారు. ధనం కూడా మంచి నీళ్ళవలె ఖర్చుగును. మీరు ఎంతటి తెలివి గలవారైననూ మీ తెలివితేటలు పనిచేయకుండా పోవును. ఇతరులకు, హామీలు, జామీనులు ఉండుటచే ఇక్కట్ల పాలగుదురు. రాహు, కేతువులు బలీయంగా ఉండుటచే శనిప్రభావంకొంతతగ్గును. అయినా ఆరోగ్యంపై దెబ్బతీయును. నరాల సంబంధ వ్యాధులు షుగరు,బి.పి.వంటివి వచ్చును. తక్కువవారివల్ల మాటలు పడుదురు. మానసికంగా చాలా ఇబ్బందులకు గురికావలసి వచ్చును. ఎంతటి దైర్యమున్నా కృంగిపోవుదురు.వ్యసనాలకు లోనగుదురు. ప్రతీ విషయంలో అణిగిమణిగి ఉండుట మంచిది. లేనిపోని నిందలకు గురికావలసి వచ్చును. ఎన్నికష్టాలు ఎదురైనా ధనం ఏదోలాసరైన సమయానికి చేతికందును. కళత్ర,పితృ,మాతృ వంశఅరిష్టలు,పీడలు. రాహు, ప్రభావంచే దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర సందర్శన కలుగును.

ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుంటాయి. జన్మశని ప్రభావం ఉంటుంది. పనియందు మనస్సులగ్నం చేయలేరు. ఇతర వ్యాపకాలు ఉండుటవల్ల అధికారులువల్ల మాటలుపడుదురు. ఆరోగ్యం మీద దెబ్బతీయును. ఆదాయంనకు లోటుండదు. ఊహించని ఖర్చులు ఎదురగును. ఋణాలు చేయవలసివచ్చును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఫర్వాలేదనిపించును. ఏదో ఒకదానిలో సెటిల్అగుదురు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వఉద్యోగులకు అపనిందలు. పర్మినెంట్ కానివార్కి ఈ సంవత్సరం కూడా నిరాశే ఎదురగును. కార్మికవర్గంలో ఉన్నవార్కి యజమానులతో ఇబ్బందులు.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఏల్పాటిశని ప్రభావం కొంత కనిపించును. వ్యతిరేకత ఉంటుంది. అధిష్ఠానవర్గంతో కూడా భేదాభిప్రాయాలు వచ్చును.కావలిసవారే  మీపై వ్యతిరేకంగా ప్రచారం చేయుదురు. పదవులు లభించుటకూడా కష్టమే అగును. నామినేటడ్ పదవి కూడా చేజారిపోవును. స్థిరాస్తులు అమ్ముదురు.

కళాకారులకు ఈ సంవత్సరం మద్యస్తంగా ఉంటుంది. విజయాలు అంతగా ఉండవు . టి.వి. సినిమారంగంలో ఉన్న నటీ నటవర్గం, గాయనీ, గాయకులు, రచయితలు, దర్శకులు, టెక్నీషియన్స్ కు అవకాశములు అంతంత మాత్రమే ఉండును. ప్రతిభకు తగిన ఫలితం ఉండదు. ఆదాయంనకు ఫర్వాలేదు. ఖర్చులు అధికం చేయుడురు..

వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. అన్ని రంగాలవార్కి మధ్యస్థంగా ఉండును. జాయింటు వ్యాపారులు విడిపోవుట జరుగును. ఇనుము, స్టీలు, బిల్డింగ్  మెటీరియల్స్ వార్కి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వర్కి బాగుండదు.నష్టాలు తప్పవు. ఫైనాన్సు రంగంలో ఉన్నవార్కి వసూళ్ళు ఉండక ఇబ్బందులు షేర్ మార్కెటిలో ఉన్నవారు నష్టపోవుదురు. ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టుదారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. సేరుకులునిల్వ చేయువారులకు ఆశించిన లాభాలురావు. ధనవ్యయం.

విద్యార్థులకు ఈ సంవత్సరం ఫర్వాలేదు. గురుబలం బాగుంది. జ్ఞాపకశక్తి పెరుగును.జన్మ శనివల్ల ఆరోగ్యభంగాలు కలుగును. ఇతర వ్యాపకాలకు లోనగుదురు చెడు స్నేహాలు కలుగును. సరైన సమయంలో చదివి పరీక్షలందు ఉత్తీర్ణులగుదురు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఆసెట్, ఐసెట్, లాసెట్, పాలిటెక్నిక్, బి. ఇడీ మొదలగు ఎంట్రన్స్ ప రీక్షలువ్రాయువారు.  మంచి ర్యాంకులతో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు మంచి విజయాలు లభించి జాతీయ, అంతర్జాతీయ జట్లకు ఎంపికఅగుదురు.

వ్యవసాయదారులకు ఒక పంట ఫలించును. రెండవ పంట దిగుబడి తగ్గి నష్టాలువచ్చును. ఆదాయంఉన్ననూ బుణాలుచేయుదురు. కౌలుదార్లకు ఇబ్బందులు పూలు నర్సరీలు, పండ్ల తోటలవారకి నప్టాలు, చేపలు, రొయ్యల చెరువులవార్కి నష్టాలు డైయిరీలకు భాగుంటుంది. ఫౌల్ట్రీ ఫారం చేయువార్కి మంచి లాభములు కల్గును.

స్త్రీలకు :- ఈ సంవత్సరం జన్మశనివలన ఆరోగ్యంమీద దెబ్బతీయును. షుగర్, బీపీ వంటి వ్యాధులు వచ్చును. యోగం విషయంలో బాగుంటుంది. మీ మాటకు తిరుగుండదు. అందరూ మీమ్మల్ని గౌరవిస్తారు. విలువైన వస్తువులు కొంటారు.మి పేరుతో నూతన వాహనం కోంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన .వివాహం కానివార్కి వివాహం జరుగును. గతంలోవిడిగా ఉన్నవారు ఈ సంవత్సరం కూడా కలవరు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ స్త్రీ సంతాన ప్రాప్తి మొత్తం మిద ఈ రాశి స్త్రీ పురుషులకు ఏల్నాటిశని ప్రభావం తగ్గును. మిగిలిన గ్రహాల సంచారం బాగుండుట వల్ల యోగం. శని ప్రభావం ఆరోగ్యం మీద చూపించును. ఆరోగ్యభంగాలు. దైవబలం ఉన్నందువలన కొంత ఫర్వాలేదు.

చేయవలసిన శాంతులు:-ఏల్పాటిశని వల్ల శనివార నియమాలు పాటించాలి. శనివారం మీ గ్రామంలో గల శివాలయంలో అభిషేకం చేయండి శ్రీశైలక్షేత్రం దర్శించండి. నరఘోష, శనిగ్రహయంత్రాలుధరించినమంచిది.


కుంభం


కుంభ రాశి (AQUARIUS)

ధనిష్ఠ 3,4 పా||లు శతభిషం 1,2,3,4 పా॥లు పూర్వాభాద్ర 1,2,3 పాదములు

ఆదాయం - 14 వ్యయం-14, రాజపూజ్యం-6 అవమానం – 1

ఈరాశి స్త్రీ పురుషాదులకు ధనలాభాధిపతియైన గురుడు జన్మంలోను శని వ్యయస్థానంలోనూ ఉండుట వల్ల జీవితం ఒక పరీక్షాకాలమా? అనిపించును శారీరకంగానూ, మానసికంగా కొంత లోలోపల కలతలు, జీవితంనందు విరక్తి నిరుత్సాహం ఏర్పడును. నిరాడంబర జీవితమే మిమ్మల్ని కాపాడును. ప్రమాదాలు నుండి తప్పించుకొనుట జరుగును. పనుల యందు విరక్తి , ఎక్కువగా తిరుగుట తగ్గించుకొనుట మంచిది. అధికార వర్గరీత్యా నమ్మకం తగ్గును. రక్తబంధు అరిష్టములు తప్పవు. మీ అహంభావమే మిమ్మల్ని కృంగదీయును. పిల్లల  భవిష్యత్తు బాగుంటుంది. ఆడవారి పోషణ వల్లనే మీ జీవితం సరిదిద్దుకొనుట జరుగును. వాహన ప్రమాదాలు తప్పవు. ప్రతి విషయంలోనూ వ్యతిరేకత ఏ పని పూర్తి కాదు. ఆదాయం మంచినీళ్ళ వలె ఖర్చుగును. ఋణాలు చేయుదురు, అందరితోనూ మాటలు పడవలసి వచ్చును. అన్నింటా వ్యతిరేకమే, నమ్మిన వారే మోసం చేయుదురు. కేసులలో ఇరుక్కొంటారు, ఈ సమయాన ఇతరులకు హామీలు, జామీనులుండరాదు. విపరీత నష్టాలు కలిగించును, కోర్టు వ్యవహారాలున్న వార్కి అపజయమే ఎదురగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనుట మంచిది.షుగర్,బి.పి.వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చును. భార్యా భర్తల మధ్య విరోధాలు పరిస్థితులు చాలా దూరం వెళ్ళును. మీరు ప్రతీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే చాలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. సంతాన పీడలు. కళత్ర, ,మాత్ర,, పితృ వంశ అరిష్టములు.

ఉద్యోగులకు ఈ సం||రం బాగుండదు. అస్తవ్యస్తంగా ఉంటుంది. పనులందు శ్రద్ధ ఉండదు. ఏ పని చేయబుద్ధి కాదు. అధికారుల వల్ల అవమానాలు పొందుదురు. అనవసర విషయములలో తలదూర్చుదురు. కేసులలో ఇరుక్కొంటారు. ఇతరులకు జామీనులు, హామీలు ఉండుట మంచిది కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందున్న వార్కి సుదూర ప్రాంతములకు బదిలీలు జరుగును. కుటుంబమునకు దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సం||రం కూడా నిరాశే మిగులుతుంది. పర్మినెంట్లు కాని వార్కి ఈ సం||రంకూడా కాదు. కార్మికవర్గానికి ఇబ్బందులు తప్పవు.

'రాజకీయ నాయకులకు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారు. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. అధిష్ఠాన వర్గంలో కూడా మీ పై సదభిప్రాయం ఉండదు. నమ్మినవారే ద్రోహం చేయుదురు. కనీసం నామినేటడ్ పదవి కూడా లభించదు. ఎన్నికలలో పోటీ చేసినట్లైన ఓడిపోవటం తధ్యం. సీట్లు కూడా రాకపోవచ్చును. ధనం మంచినీళ్ళవలెఖర్చు అగును.

కళాకారులకు విజయములుండవు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. టి.వి సినిమారంగంలో ఉన్న నటీనటవర్గం,గాయనీ, గాయకులు, రచయితలు, దర్శకులు, టెక్నిషియన్స్ ఫెయిల్యూర్స్ ఎక్కువ. నూతన అవకాశాలు ఉండవు. ఆర్ధిక సమస్యలు.

 వ్యాపారస్తులకు ఈసం||రం బాగుండదు. అన్ని రకాలవార్కి ఇబ్బందులు తప్పవు. కొంతమంది వ్యాపారం మూసేసే పరిస్థితి ఉంటుంది. కిరాణా, జనరల్, మెడికల్ వ్యాపారులకు కొంత ఫర్వాలేదు. జాయింటు వ్యాపారులు విడిపోవుదురు. ఇనుము మొదలగు బిల్డింగ్ వ్యాపారాలకు కొంత అనుకూలం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నష్టాలు తప్పవు. షేర్ మార్కెట్ లో ఉన్న వారికి విపరీతనష్టాలు. ఫైనాన్సు రంగంలో ఉన్న బిల్సురాక నష్టాలు. నూతన కాంట్రాక్టులు కూడా రావు.  ప్రభుత్వ దాడులు జరుగును.

విద్యార్థులకు ఈ సం॥రం చాలా కఠిన పరీక్షగా ఉంటుంది. గురు, శనుల ప్రభావం వల్ల చదువు పై శ్రద్ధ చూపలేరు. పరీక్షలలో కావలసిన మార్కులు సాధించలేరు. ఆరోగ్య భంగం. పరీక్షల వేళ నలత చేయును. ఇంజనీరింగ్, మెడికల్, అసెట్, ఆసెట్, ఐసెట్, లాసెట్, బి.ఇడి. పాలిటెక్నిక్ పరీక్షలయందు క్వాలిఫై అవ్వరు.

 వ్యవసాయదారులకు రెండు పంటలందు సరైన దిగుబడి లేక నష్ట పోవుదురు. శుభకార్యాలు నిలిచిపోవును. ఋణాలు చేయువలసి వచ్చును. కౌలుదారులు విపరీతంగా నష్టపోవును. జీవనం ప్రశ్నార్థకంగా మారును. నర్సరీ, పూలు, పండ్ల తోటలకు నష్టం వాటిల్లును. డైయిరీల వార్కి కొంత ఫర్వాలేదని పించును. చేపలు, రొయ్యలు, ఎరువులు వారు భారీగా నష్టపోవుదురు. ఫౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి నష్టాలురావు.

స్త్రీలకు: ఈ సం|| బాగుండదు. గురు, శనుల ప్రభావం అధికంగా ఉండుటచే ఆవమానకర సంఘటనలు జరుగును. ఏ పని చేయబుద్ధి కాదు. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. మీ పేరుతో ఉన్న ఆస్తులు అమ్మవలసి వచ్చును. ఆరోగ్యం కూడా బాగుండదు. బి.పి.షుగర్ వంటి వ్యాధులు వచ్చును. భార్యా భర్తల మధ్య అవగాహన ఉండదు. ఉద్యోగులకు సుదూర ప్రాంతములకు బదిలీలు. అధికారులతో విరోధములు. వివాహం కానివారికి ఈ సం॥ వివాహం కాదు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ, స్త్రీ సంతాన ప్రాప్తి, జీవనం ప్రశ్నార్థకంగా ఉంటుంది.

 మొత్తంమీద ఈ రాశి స్త్రీ పురుషులకు జీవన్మరణ సమస్య. ఏల్నాటి శని, జన్మగురు ప్రభావంచే ఇబ్బందులు. మీరు ఎంతటి తెలివైనవారు అయిన ఇబ్బందులు తప్పవు.

చేయవలసి శాంతులు :- ఈ సం|| గురు, శనివార నియమాలు పాటించి, గురు, శనివారములలో మీ గ్రామంలో గల శివాలయములందు రుద్రాభిషేకం చేయండి శ్రీ శైల క్షేత్రం దర్శించి జాగరణ చేయాలి. గురు, శని యంత్రాలు ధరించిన మంచిది.

 

 


మీనం


మీనరాశి (pisces)

పూర్వాభాద్ర 4వ పాదము ఉత్తరాభాద్ర 1,2,3,4, పా॥లు రేవతి 1,2,3,4.పా॥లు

ఆదాయం - 11 వ్యయం -5 ,రాజపూజ్యం - 2 అవమానం - 4

ఈ రాశి స్త్రీ పురుషాదులకు లగ్నరాజ్యాధి పతియైన గురుడు వ్యయస్థానంలో,శని లాభ స్థానంలోనూ, రాహు, కేతువులు,మంచి స్థానములలో ఉండుట వలన గత సంవత్సరం కన్నా పరిస్థితులు చక్కబడి ఏ పని చేసినా విజయవంతంగా నుండును. ఆదాయం గౌరవాదులకు లోటురాదు. గత సం||లో సాధించలేని కార్యములు సాధిస్తారు. క్రొత్తవైన పధకాలు వేయుట వాటిని అమలు చేసి ఘనమైన పనులు సాధిస్తారు. గృహంలో వివాహాది శుభకార్యములు కలిసివచ్చుట. నూతన బాంధవ్యాలు ఏర్పడును. ఆకస్మిక ధన లాభాలు కలిగి ఖర్చులు అధికంగా ఉండును. అనుకోని ఖర్చులు ఎదురగును. ముఖ్యంగా స్వశరీర ఆరోగ్యం పట్ల బాధపడుట జరుగును. అకారణముగా కోర్టు వ్యవహారములలో దిగుట ప్రతీ చిన్న పెద్ద పనులలో స్త్రీ, పురుషాదులకు, లోలోపల భీతి, కలవరం, ఆందోళన చెందుట, ముందుకు సాహసించలేక పోవుట కలుగును. అన్నింటి కంటే తగిన ఓర్పు, మౌనంగా ఉండుట మంచిది. అధికారుల సహకారం లభించును. కుటుంబంలో ఒక్కోసారి మాట పట్టింపులు వచ్చును. ప్రతీ విషయంలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. శతృవులు కూడా మిత్రులగుదురు. ఆదాయంనకు మించిన ఖర్చులు చేయుదురు. సమయానికి ధనము చేతికందును. గృహ నిర్మాణములు కలిసి వచ్చును. వాహన మార్పు తప్పదు సంతానం ద్వారా లాభించును. మీ మాటలు ఒక్కో సమయాన ఎదుటవార్ని బాధ కలిగించుటచే కొన్ని పనులు నిలిచిపోవును. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. షుగర్, బి.పి. వంటి వ్యాధులు వచ్చును.

ఉద్యోగులకు ఈ సం||రం అనుకూలంగా ఉంటుంది. పనులపై శ్రద్ధ వహిస్తారు. అధికారుల మన్ననలు పొందగలరు. మీ పై అధికారులు సహితం మీ సలహా తీసుకుంటారు. నూతన వాహనం కొంటారు. గృహ నిర్మాణములు కలిసి వచ్చును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులకు ప్రమోషన్స్ తో కూడి బదిలీలు జరుగును. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు.

 రాజకీయ నాయకులకు ఈ సం||రం శని, రాహువుల బలం బాగుంది.మీ మాటకు ఎదురుండదు.ప్రజలలో మీ పేరు ప్రక్యతులు పెరుగును.అందరూ సహకరిస్తారు. అధిష్టాన వర్గం వారు కూడా మీ పై సదభిప్రాయం కలిగి ఉంటారు.  పదవులు లభించును పార్టీలో గాని ఇతరత్రా నామినేటెడ్ పదవైన తప్పక లభించును.

కళాకారులకు చాలా బాగుంటుంది. విజయలు లభించును టి.వి. సినిమా రంగంలో ఉన్న , సినీ నటులకు, గాయనీ గాయకులకు, రచయితలు, టెక్నీషియన్స్ చాలా బాగుంటుంది. నూతన అవకాశములు విరివిగా వచ్చును. ప్రభుత్వ ప్రవేటు సంస్థల అవార్డులు, రివార్డులు తప్పక మిమ్మల్ని వరిస్తాయి.

వ్యాపారస్తులకు ఈ సం||రం మహోన్నతంగా ఉంటుంది. అన్నిరకముల వార్కి బాగుంటుంది. అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరును ఆశించిన లాభములు పొందగలరు. క్రొత్తవాటిని ప్రారంభిస్తారు. హోల్ సేల్ రిటైల్ రంగంలో ఉన్న వార్కి మంచి వ్యాపారములు జరుగును. స్థిరాస్తులను కొంటారు. రియల్ ఎస్టేటు రంగంలో ఉన్నవార్కి బాగుంటుంది. ఇనుము, మొ॥గు బిల్డింగ్ మెటీరియల్ వార్కి విపరీత లాభములు, బంగారం, వెండి వ్యాపారులకు మంచి లాభములు. జాయింటు వ్యాపారులకు కలిసి వచ్చును. షేర్ మార్కెట్లో ఉన్నవార్కి విశేష లాభం.

 విద్యార్థులకు మాత్రం ఈ సం||రం మిశ్రమంగా ఉంటుంది. గురుబలం లేదు. జ్ఞాపకశక్తి ఉండదు. శని రాహువులు బలీయంగా ఉన్నందున చదువు పై శ్రద్ధ ఎక్కువ చూపాలి. ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్, ఆసెట్, ఐసెట్, లాసెట్, బి.ఇడి.. పాలిటెక్నిక్ మొ॥గుఎంట్రన్సు పరీక్షల యందు ర్యాంకులు వచ్చి సీట్లను పొందగలరు.

వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును. కౌలుదార్లకు విశేషంగా ఉంటుంది. చేపలు, రొయ్యల చెరువుల, పౌల్ట్రీరంగంలో వార్కి విశేష లాభాలు. నర్సరీ, పూలు, పండ్ల తోటల వార్కి మంచి ధరలతో విపరీతంగా కలిసి వచ్చును.

స్త్రీలకు: ఈ సం||రం చాలా అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం బాగుంది. పనులందు శ్రద్ధ చూపుతారు. ఇతరులు అనేక విషయాల్లో మీ సలహాలు తీసుకుంటారు. మీ పేరుతో విలువైన వస్తువులు, స్థిరాస్తులు ఏర్పడును. వాహన సౌఖ్యం. కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన. గతంలో విడిగా ఉన్నవారు తిరిగి కలుస్తారు. ఉద్యోగం చేయు వార్కి అధికారుల మన్ననలు ప్రమోషన్లు. వివాహం కానీ వారికి ఈ సం||రం తప్పక వివాహం జరిగి తీరును.  గర్బిణి స్త్రీలకు ఫ్రీ డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి, సంతానం లేనివార్కి ఈసం||రం సంతానప్రాప్తి .

మొత్తంమ్మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహబలం, దైవబలం బాగుంది. ఏది తల పెట్టినా పూర్తగును. ఈర్ష్య, అసూయ, నరఘోష ఎక్కువ కావున జాగ్రత్త.

చేయవలసిన శాంతులు: నరఘోష అధికంగా ఉండుటచే మంగళ,గురువార నియమాలు పాటించాలి. మంగళ , గురువారములలో మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయండి. శ్రీశైలక్షేత్ర దర్శనము, గురు, నరఘోష యంత్రాలు ధరించిన మంచిది.