×

బల్లి శాస్త్రము

1.తలమీద బ్రహ్మ రంద్రమునకు వెనుక – సంపన్నులగుదురు .

2. నదినెత్తిమీద – రోగభయము

3.కుడినెత్తి మీద –తోబుట్టువులకు కీడు అన్నాతమ్ములకు కీడు

4.నెత్తి వెనుక బల్లిపడిన – తమ్ములకు కీడు

5.తలమీద బ్రహ్మరంధ్రమునకు ముందు పడిన - మేనమామలకు చేటు

6. తలమీద బ్రహ్మరంధ్రమున పడిన - మరణము

7. పాపిడి యందు పడిన – తల్లి తోబుటువుల కరిష్టము

8. ముంగురుల మీద - హాని, కలహము

9. జుట్టుకొనయందు - దు:ఖము, భర్తతో కలహము.

10. జుట్టుమీద - కష్టనష్టములు

11. జడమీద - భర్తకు కష్టము

12. కేశాంతము (చివరవెంట్రుకల) మీద - అనాయాస మరణము

13. ముచ్చిలి గుంటలో - అధిక భారము వహించుట.

14. పాదములందు-వివాహము (భర్తకు జయము)

15. చెక్కిళ్ల యందు పురుషులకు - బంధుదర్శనము

16. చెక్కిళ్ల యందు స్త్రీలకు - అశుభము

17. స్త్రీలకు చెవిదగ్గలు, చెంపమీద - శుభము

18. స్త్రీలకు తలముసుగుమీద - కీడు (భర్తకు ఆపద)

19. పురుషులకు తలముసుగు మీద - కీడు జరుగును.

20. చెవిమీద - చెడువార్తల వినుట

21. కనుబొమ్మల మధ్య - కలహసూచన

22. కనుబొమ్మలమీద - ధనలాభము

23. కుడికన్ను మీద - పరాజయము

24. ఎడమ కన్నుమీద - అవమానము

25. ముక్కుమీద - కార్యహాని

26. ముక్కు ప్రక్కన - కార్యలాభము

27. మీసము మీద - అధికార లాభము

28. పై పెదవిమీద - భూలాభము

29. క్రింది పెదవిమీద - మృష్టాన్న భోజనము

30. నాలుకయందు-విద్యాలాభము

31. గడ్డముమీద - అపమృత్యువు

32. దంతములమీద- భూమినష్టము

33. గడ్డము వెంట్రుకలమీద - కారాగారప్రాప్తి

34. వెనుక మెడయందు - మరణభయము

35. ముందువైపు కంఠమునందు- బుద్దీ నాశము, ఆత్మహత్య

36. గొంతుక ఎముకమీద - ఉభయ సంకటములు

37. గొంతుక మీద - భోగభాగ్యములు

38. రొమ్ముమీద -జయము

39. గుండె మీద- - అధైర్యము, ఆందోళన

40. పై కడుపున - పుత్రలాభము

41. బొడ్డున - భయము, ఆందోళన

42. బొడ్డునకు దిగువన - రోగము, సుఖహీనత

43. కడుపు ప్రక్కన - ఆరోగ్యము

44. భుజములందు - సహాయ సహాకారములు

45. చేతులందు - ప్రయత్న కార్యభంగము

46. అరచేతియందు - ద్రవ్యలాభము

47. మోచేతియందు - సహాయనాశనము

48. మణిబంధమున - గర్వభంగము

49. గోళ్లయందు - జంతు భయము

50. చంకలో - పిశాచభయము

51. వెన్ను - శతృభయము

52. వెన్ను ఎముకయందు - భూతపిశాచ భయము

53. నడుము ఎముకయందు - నూతన వస్త్రలాభము

54. పిరుదులందు - శయ్యాభోగము

55. తొడఎముక - విషభయము

56. ముందు తొడమీద – సుఖసౌఖ్యములు

57. స్త్రీకి తొడమీద - - వ్యభిచారము

58. తొడ మొదట - బలహీనము

59. శిశ్నమందు - సంతానము

60. శిశ్నాగ్రమందు - దాంపత్య భంగము

61. శిశ్నరోమములందు - దేశ భ్రమణము

62. వృషణములందు దానికి దిగువన - చోరత్వము

63. గుదమందు - ఆయుధభయము

64. మోకాలి యందు - వాహనలాభము

65. మోకాలి సంధియందు - వాహన భ్రంశము

66. మోకాలి క్రింద - వాతరోగము

67. మోకాలి వెనుక నరముల మీద - రోగముగా ధనవ్యయము

68. పిక్కల యందు - కార్యానుకూలము.

69. మోకాలి ఎముకమీద - వ్యాపార లాభము

70. పాదముల ఎముకమీద - కార్యహాని

71. పాదములు సందియందు రోగము.

72. పాదముల వెనుక - కారాగృహప్రవేశము

73. పాదమున - ప్రయాణము

74. వ్రేళ్లయందు - రోగము

75. అరికాలియందు - భూలాభము

76. తలనుండి క్రిందకు దిగిన - కష్టనష్టములు

77. పాదములనుండి పైకెక్కిన - ఇష్టకార్యసిద్ధి

గమనిక :- బల్లి పసిపిల్లలు, ఉపనయము చేయనివారి మీద పడి ఆఫలితములు తల్లితండ్రుల మీద చూపును, బల్లిశరీరము మీద పడిన వెంటనే స్నానము చేసి ఇష్టదేవతాపూజలుగాని, ప్రార్ధనలుగాని చేసిన దోషములనుండి విముక్తి జరుగునని శాస్త్ర నిర్ణయము కావునా అట్లు చేసి కష్ట విముక్తులు పొందగలరు.