×

రూ.10 కే కార్పొరేట్ వైద్యం.. ఎక్కడో కాదు మన దగ్గరే!

  • పది రూపాయలకే కార్పొరేట్ వైద్యం
  • ఎస్ కేఆర్ ఆసుపత్రి సేవా దృక్పథం
  • హైదరాబాద్ నాంపల్లిలో ఆసుపత్రి

S Care Hospital: మనిషికి అన్నింటి క‌న్నా ఆరోగ్యం ముఖ్యం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. కానీ.. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది చిన్నవయస్సుల్లోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో వైద్యం ఖరీదైపోయింది. చిన్నపాటి జ్వరం వ‌స్తే చాలు వేల‌కు వేలు ఫీజుల‌తో కార్పోరేట్ ఆసుపత్రులు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ పరీక్షలు, ఈ పరీక్షలు చేయాల‌ని వేల‌కు వేలు దోచేస్తున్నారు. లక్షలు పెట్టి వైద్యం చేయించుకునే స్థోమత లేక చాలా మంది పేదలు ధర్మాసుపత్రులకు వెళ్తున్నారు.

అయితే కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు చేరువ చేసేందుకు ఎస్‌ కేర్ ఆసుపత్రి ముందుకొచ్చింది. పది రూపాయలకే కార్పొరేట్ స్థాయిలో ట్రీట్‌మెంట్ అందించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ నాంపల్లి పరిధిలోని విజయనగర్ కాలనీలో ఎస్ కేర్ హాస్పిటల్ను చైర్మన్ స్రవంతి శ్రీధర్, హాస్పిటల్ చీఫ్ డాక్టర్ శ్రీధర్తో కలిసి ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. సేవా దృక్పథంతో అందరికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ సేవలను ప్రారంభించినట్లు హాస్పిటల్ ఛైర్మన్, చీఫ్ వెల్లడించారు.

  • August 29 , 2023
  • 11:13 am