మణిపూర్(Manipur)లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు(Telangana Student) హైదరాబాద్‌కు చేరుకున్నారు. మణిపూర్‌లో అల్లర్ల నేపధ్యంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాన్ని(Special Flight) ఏర్పాటుచేసింది.
సోమవారం ఉదయం మణిపూర్ రాజధాని ఇంఫాల్(Imphal) మీదుగా బయలు దేరిన విమానం మధ్యాహం రెండు గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు(Shamshabad Airport) చేరుకుంది. తెలంగాణ భవన్ అధికారులు మొదటి విడతగా 106 మంది విద్యార్థులను హైదరాబాద్(Hyderabad)కు తీసుకువచ్చింది. దీంతో పాటుగా ఏపీ(AP))కి చెందిన 108మంది విద్యార్థులకు కూడా మరో విమానంలో శంషాబాద్‌కు చేరుకున్నారు.