×

ఆ గుడిలో ఏటా పెరుగుతున్న శివలింగం..శివాలయంలో జోలెపట్టి వేడుకుంటే ఎంతటి కష్టమైన ఇట్టే మాయం !!

మహాశివరాత్రిని పురస్కరించుకొని..దేశ వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు,శివాలయాలు శివన్మామస్మరణతో మార్మోగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలోని రంగారెడ్ది జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని రాయికల్ గ్రామంలోని శివాలయంలో ఉన్న లింగాన్ని త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించినట్టుగా మాణిక్య ప్రభు చరిత్రలో పేర్కొన్నారు అందుకు గుర్తుగా శివలింగంపై రామబాణం గుర్తు ఉంటుంది. పంచముఖగుట్టపై వెలిసిన రామలింగేశ్వరుడిని స్వయంగా శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించాడంతో ఈ ఆలయానికి ఎంతో విశిష్టత నెలకొంది. ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తులంకాధిపతి రావణాసురని సంహరించి సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తూ దండకారణ్య ప్రాంతమైన రామేశ్వరంలోని బదిరీ వృక్షం కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసారని భక్తుల విశ్వాసం.

  • February 17 , 2023
  • 10:23 am