చంద్రయాన్ 3 విజయవంతమైంది. చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ దిగే సన్నివేశానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి కిరీటానికి పోలిక ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.చంద్రయాన్ ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమలని సందర్శించింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రయాన్ నమూనాకు పూజలు చేశారు.ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న చంద్రయాన్-3ని ప్రయోగించారు. అంతకు ముందు ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుపతిని సందర్శించింది. దీన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. శాస్త్రవేత్తలు మూఢనమ్మకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని విమర్శించారు.
విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ చేయడానికి ముందు, ఇస్రో అధ్యక్షుడు సోమనాథ్.. అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు. బెంగళూరులోని జాలహళ్లి క్రాస్ సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.చంద్రయాన్-3లోని ల్యాండర్ మాడ్యూల్( విక్రమ్ ల్యాండర్,ప్రగ్యాన్ రోవర్ తో కలిగి ఉంటుంది)ను చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్ గా ల్యాండ్ అయింది. మూన్ మిషన్ సక్సెస్ కావడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగితేలింది.