2024 జనవరి 22న అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. జనవరి 23 నుంచి సామాన్య భక్తులు బాల రాముణ్ని దర్శించుకోవచ్చు. ఐతే.. ఇక్కడే కొన్ని రూల్స్ అమలుచేస్తున్నారు.
రామాలయంలోకి వెళ్లడానికి ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ వంటి ఏదైనా ఐడీ కార్డు తప్పనిసరిగా అవసరం. హారతి పాస్ బుకింగ్ కోసం మీరు ఏ ఐడీ కార్డును ఉపయోగిస్తారో, అదే ఐడీ కార్డును ఎంట్రీ దగ్గర కూడా చూపించాలి. దాంతో రెండు ఐడీలనూ పరిశీలించి, రెండూ ఒకటే అని నిర్ధారించుకున్న తర్వాతే, ఆలయంలోకి వెళ్లనిస్తారు.
చాలా మంది హారతి కార్యక్రమానికి వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. అలా బుక్ చేసుకున్నవారికి పాస్ వస్తుంది. ఆ పాస్‌తోపాటూ ఐడీ కార్డును కూడా చెక్ చేస్తారు.