×

మూలికల కోసం వెళ్లి హిమపాతంలో ఆరుగురు గల్లంతు.. ముగ్గురు మృతి

హిమాలయాల్లో అరుదైన మూలికల అన్వేషణ కోసం వెళ్లి ఆరుగురు అదృశ్యమైన ఘటన నేపాల్‌లో చోటుచేసుకుంది. హిమాలయన్‌ వయాగ్రా గా పిలిచే అత్యంత విలువైన మూలిక యర్షగుంబాను తీసుకొచ్చేందుకు వెళ్లిన బృందం హిమపాతంలో చిక్కుకున్నారు. వారిలో ఆరుగురి ఆచూకీ గల్లంతుకాగా... ఇప్పటి వరకూ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. నేపాల్‌ ధార్‌చులా జిల్లాలోని కొండల్లో మంగళవారం భారీ హిమపాతం సంభవించింది. అదే సమయంలో యర్షగుంబా మూలిక అన్వేషణలో భాగంగా అక్కడ టెంట్లు వేసుకున్న 12 మంది ఆ మంచు తుఫానులో గల్లంతయ్యారు.

తక్షణమే స్పందించిన స్థానికులు భద్రతా దళాలకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. వారిలో కొందర్ని ప్రాణాలతో రక్షించగా.. మరో నలుగురు పురుషులు, ఇద్దరు స్త్రీల ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ నేపథ్యంలో అదనంగా మరో 25 మంది భద్రతా సిబ్బందిని అక్కడకు పంపారు. ఈ క్రమంలో గల్లంతైన ఆరుగురులో ముగ్గురు చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఇద్దరు మహిళలు సహా మూడు మృతదేహాలను గుర్తించారు. కనిపించకుండా పోయిన ప్రదేశానికి కిలోమీటరున్నర దూరంలో మృతదేహాలను గుర్తించామని స్థానిక డీఎస్పీ ఈశ్వరిదత్తా భట్ తెలిపారు. మృతదేహాలను గుర్తించిన ప్రదేశానికి స్థానికులు, నేపాల్ పోలీసులు, తమ బృందాలు చేరుకున్నాయని వీరిని గుర్తించాల్సి ఉందని చెప్పారు.

  • May 07 , 2023
  • 02:14 pm