×

కైలాస దేశానికి భారీ షాక్.. మోసపోయామంటూ కీలక ఒప్పందాన్ని రద్దుచేసుకున్న అమెరికన్ సిటీ

 

 

లలితా పీఠం ( విశాఖపట్నం ) : Nithyananda అత్యాచారం, అపహరణ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ 2019లో దేశం నుంచి పారిపోయిన వివాదాస్పద నిత్యానంద (Nithyananda).. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస (United States of Kailasa) పేరుతో ఓ కల్పిత దేశాన్ని సృష్టించాడు. ఇటీవల ఐక్యరాజ్యసమితి (UNO) సమావేశాలకు తన ప్రతినిధులను పంపి వార్తల్లో నిలిచిన నిత్యానందకు భారీ షాక్ తగిలింది. కైలాస దేశానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు కోసం నిత్యానంద అనుచరగణం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా నగరం నెవార్క్ ప్రకటించింది. తాము మోసపోయామని, జరిగిన దానికి చింతిస్తున్నామని అమెరికన్‌ సిటీ నెవార్క్ (Newark) ఓ ప్రకటనలో తెలిపింది.

‘‘మేం మోసపోయాం.. జరిగినదానికి చింతిస్తున్నాం.. కైలాస దేశం పరిసర పరిస్థితుల గురించి తెలుసుకున్న వెంటనే మేం స్పందించాం.. దాని చుట్టూరా అన్నీ వివాదాలే. అందుకే ఆ దేశంతో చేసుకున్న సిస్టర్ సిటీ ఒప్పందాన్ని జనవరి 18వ తేదీనే రద్దు చేసుకున్నాం.. ఇది విచారించదగిన సంఘటన అయినప్పటికీ నెవార్క్ నగరం పరస్పర గౌరవం, అనుసంధానం, మద్దతుతో విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులతో భాగస్వామ్యానికి కట్టుబడి ఉంది’’ అని ఆ నగర అధికార ప్రతినిధి సుసాన్‌ గారోఫాలో స్పష్టం చేశారు.

అయితే, కైలాస ప్రభుత్వ వెబ్‌సైట్‌ మాత్రం.. అమెరికా నగరం, తమ యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాసను (USK)ను గుర్తించిందని, ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుందంటూ సంబంధిత పత్రాలను పోస్ట్‌ చేస్తూ ప్రచారం చేసుకోవడం గమనార్హం. జనవరి 12న నెవార్క్‌ సిటీ హాల్‌లో కైలాస ప్రతినిధులతో ఒప్పందం జరిగినట్లు సమాచారం. అయితే మోసం గురించి తెలిసిన వెంటనే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని, అది చెల్లుబాటు కాదని, పైగా కైలాసం చుట్టూ వివాదాలు ఉన్నట్లు గుర్తించామని నెవార్క్‌ ప్రతినిధులు వెల్లడించారు.నెవార్క్ కౌన్సిల్‌మన్ లార్జ్ లూయిస్ క్వింటానా ఒప్పందాన్ని రద్దు చేసే ప్రతిపాదనను చేశారు. ‘‘సిస్టర్ సిటీ ఒప్పందం కుదుర్చుకునే ఏ నగరమైనా ముందుకు వెళ్లాలంటే మానవ హక్కుల విషయంలో మంచి ప్రమాణాలు ఉండాలి.. మేము సిస్టర్ సిటీస్ ఇంటర్నేషనల్‌ను వివాదం ఉన్న సమయంలో తీసుకురాలేం.. ఇది ఒక పర్యవేక్షణ.. మానవ హక్కులు లేని పరిస్థితిలో నెవార్క్ సిస్టర్ నగరంగా ఉండదు’’ అని చెప్పారు.

అతను ముందుకు వెళుతున్నప్పుడు, సోదరి నగరాలను ప్రోత్సహిస్తున్నప్పుడు, "మానవ హక్కులు లేని ప్రభుత్వాలతో" ఒప్పందాలు కుదుర్చుకోలేమని నిర్ధారించుకోవాలి. గత నెల, USK ప్రతినిధులు జెనీవాలో జరిగిన రెండు UN బహిరంగ సమావేశాలకు హాజరయ్యారు - ఫిబ్రవరి 22న మహిళలపై వివక్ష నిర్మూలన కమిటీ (CEDAW) నిర్వహించిన 'నిర్ణయాత్మక వ్యవస్థల్లో మహిళల సమాన మరియు సమ్మిళిత ప్రాతినిధ్యం'పై సాధారణ చర్చ
అత్యాచారం, కిడ్నాప్‌ వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందపై నాన్-బెయిల్ వారెంట్లు జారీ అయ్యాయి. 2019లో దేశం విడిచి పారిపోయిన ఆయన.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. ఆ దేశానికి పౌరసత్వం జారీ, కరెన్సీ, ప్రత్యేక రిజర్వ్ బ్యాంకు కూడా ఏర్పాటుచేసినట్టు తెలిపాడు. తాజాగా కైలాస తరపున ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ఇద్దరు ప్రతినిధులు హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. నిత్యానందను భారత్ వేధింపులకు గురిచేస్తోందని, మాతృదేశం నుంచే బహిష్కరణకు గురయ్యాడంటూ కైలాస ప్రతినిధిగా చెప్పుకుంటూ ఐరాసలో విజయప్రియ చేసిన ప్రసంగం.. దానిని ఐరాస మానవహక్కుల కమిషన్‌ కొట్టిపారేయడం గురించి తెలిసిందే.

ఇదిలా ఉండగా, నిత్యానంద ఏర్పాటు చేసుకున్న కైలాస దేశం ఎక్కడ ఉందో స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలోని దీవుల్లో ఒకదానిలో ఉందని చెబుతున్నప్పటికీ.. నిత్యానంద తమ దేశ పరిసరాల్లోనే లేడంటూ ఈక్వెడార్‌ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు. పరమహంస నిత్యానంద ఫాలోవర్స్‌ మాత్రం కైలాసను విపరీతంగా ప్రమోట్‌ చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులను కలిసి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా కైలాస మీద నడిచే ట్రోలింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు

  • March 12 , 2023
  • 10:21 am