తిరుమల ( లలితా పీఠం ) : తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం.. దేశం నలుమూలల నుంచి ఇక్కడకు భక్తులు వస్తుంటారు. స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు కాస్తుంటారు. అయితే శని ఆదివారాల్లో భక్తుల రద్దీగా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ టోకెన్లు తప్పనిసరిగా తీసుకుంటే మంచిది.
తిరుమలలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది. నిత్యం వేలాది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. అందుకే తిరుమల ఆలయంలో క్యూ లైన్లన్నీ ఎప్పుడూ రద్దీగా ఉంటాయి.
సాధారణంగా తిరుమలలో మనకు కావాల్సిన కార్యాలయాలు.. దర్శనం క్యూలైన్.. గదుల కేటాయింపు కౌంటర్.. ఈవో కార్యాలయం.. చైర్మన్ కార్యాలయం.. వసతి గదులకు వెళ్లాలంటే కొంత ఇబ్బంది తప్పదు.. పదే పదే ఎవరినైనా అడుగుతూ వెళ్లాలి.. లేదా దళారులను నమ్మి ఆటోలకు డబ్బులు తగలేయాలి.
అయితే ప్రస్తుతం శని ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనంకు 20 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.
శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విమాన ప్రకారం ప్రదక్షిణ దిశగా చేస్తూ కళ్యాణోత్సవ మండపంకు వేంచేపు చేసి, స్వామి అమ్మవార్ల కు కళ్యాణోత్సవం కార్యక్రమంను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అర్చకులు
శ్రీ వారికి నిత్యం అనేక రకాల సేవలు చేస్తుంటారు అర్చకులు. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు.