విశాఖపట్నం ( లలితా పీఠం ) : హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో కిట కిట లాడుతున్నాయి శివాలయాలు. తెల్లవారుజామున నుండి భక్తుల ప్రత్యేక అభిషేక పూజలు.. మహాశివరాత్రి , శనిత్రయోదశి విశిష్టత కావడంతో భక్తుల ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం ఈసారి శనిత్రయోదశి, శనివారం రోజు రావడం మరింత శుభప్రదమని చెబుతున్నారు పండితులు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో కిట కిట లాడుతున్నాయి శివాలయలు .. తెల్లవారుజామున నుండి భక్తుల ప్రత్యేక అభిషేక పూజలు.. మహాశివరాత్రి , శనిత్రయోదశి విశిష్టత కావడంతో భక్తుల ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా అమరావతి అమరేశ్వరాలయం లో తెల్లవారుజామున నుండే భక్తులు రద్దీ నెలకొంది. కృష్ణానదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి బాలా చాముండికా సమేత అమరేశ్వరునికి పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం భక్తుల శివనామస్మరణ తో మారుమ్రోగింది. మహా శివరాత్రి, శని త్రయోదశి కలిసి రావడంతో శైవ క్షేత్రాలతో సహా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున నుండి భక్తులు వృద్ధ గౌతమి గోదావరి లో పుణ్య స్నానాలు ఆచరించి మహాశివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామిని దర్షించు కోవడానికి ఆలయం వద్ద క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. రాత్రి ఒంటిగంటకు స్వామివారికి తొలి అభిషేకం చేశారు అర్చకులు. మహానంది క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉదయం శేష వాహనం,సాయంత్రం నంది వాహనం పై భక్తులకు శివయ్య దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 10 గంటలకు లింగోద్భవ కార్యక్రమం జరుగనుంది. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి కళ్యాణం జరిపించనున్నారు. రాత్రి జాగరణ సందర్భంగా ఆలయ పరిసరాలలో సంస్కృత కార్యక్రమాలను నిర్వహించనున్నారు. విశాఖపట్నం అడివివరం లలితా పీఠంలో రాత్రి 9 గంటలకు రుద్రాభిషేకం కార్యక్రమం జరుగును ఉదయం నుంచే భక్తులు తమ గోత్రనమలతో సహస్రలింగార్చన కార్యక్రమంలో పాల్గొంటున్నారు..