అయోధ్యలోని రాముడి దివ్యమైన, గొప్ప ఆలయం ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధంగా ఉంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణం యొక్క ఫ్రంట్ లుక్ చిత్రాలను విడుదల చేసింది. ప్రతి రామభక్తుడూ వీటిని చూసి ఉద్వేగానికి లోనవుతున్నారు.
అయోధ్యలోని రాముడి దివ్యమైన, గొప్ప ఆలయం వేగంగా రూపుదిద్దుకుంటోంది. దాదాపు పూర్తవుతున్న లుక్ కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన తాజా ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. ఇవి భక్తులకు తెగ నచ్చేస్తున్నాయి. తమ రాముడి ఆలయాన్ని చూసి.. పరమానందం చెందుతున్నారు.
రామ మందిరాన్ని ఫ్రంట్ నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఆ ఫొటో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇది ప్రజలందరిలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ రెండో దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రాలలో మీరు ఆలయ అద్భుతమైన, అతీంద్రియ దృశ్యాన్ని చూడవచ్చు.