Wishes
  • చిరంజీవి మహాలక్ష్మి పుట్టినరోజు శుభాకాంక్షలు , మీ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిగినవి.
  • TODAY'S NITHAYPOOJA MEMBERS :
CONTACT US

అలిపిరి మెట్ల మార్గం సమీపంలో అస్థిపంజరం కలకలం.. చెట్టుకు వేలాడుతున్న మృతదేహం!

 తిరుమల అలిపిరి నడక మార్గంలో అస్థిపంజరం కలకలం సృష్టించింది. శేషాచలం అటవీ ప్రాంతంలో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా సీఎస్‌పురం మండలం నల్లమడగలకు చెందిన సి.మహేష్‌బాబు(35) మహారాష్ట్రలోని పుణెలో ఉన్న ఆర్మీ క్యాంటీన్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. 2020 ఫిబ్రవరి నుంచి కనిపించకుండా పోయారు. దీనిపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది.

ఇదిలావుంటే, అలిపిరి- తిరుమల నడక మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటవీ ప్రాంతం కావడంతో ఎవరూ గుర్తించలేదు. మృతదేహం ఎముకలు బయటపడి ఉండటంతో శుక్రవారం గమనించిన కొందరు టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చారు.

ఈ ఘటనకు సంబంధించి తిరుమల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న పరిసరాల్లో తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించారు.ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌కార్డు లభించాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో మృతుడి వివరాలు లభించాయి. దీంతో తిరుమల పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే మహేష్‌బాబు ఆత్మహత్యకు కారణాలు

 

  • May 30 , 2021
  • 10:05 am